యాసంగి పంట ప్రతి గింజను కొంటాం..చెన్నమనేని రమేష్ బాబు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలంలో రూ.3.50 కోట్ల పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాలు చేసిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.2కోట్ల రూపాయలతో 33/11కెవి కథలాపూర్ ఎస్‌ఎస్‌లో సిస్టమ్ పటిష్టత పని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని కథలాపూర్,సిరికొండ,దూలూర్ , దూం పేట, పోసానిపేట గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది అన్నారు.తరువాత సిరికొండలో రు.20 లక్షలతో నిర్మించే పీ.హెచ్.సీ సెంటరుకు భూమి పూజ, 1.30 లక్షలతో బొమ్మేన వద్ద నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించారు.

 Let's Buy Every Grain Of Yasangi Crop , Yasangi Crop , Kcr , Chennamaneni Rames-TeluguStop.com

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు భారతదేశంలోనే నాణ్యమైన ఉచిత కరెంట్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతులను ముఖచిత్రం లో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుశక్తి రంగంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టిన రాష్ట్రం మన రాష్ట్రమే అంతేకాకుండా విద్యుశక్తి ని ఆదాచేయాలి.మన ఇంజనీర్లు అనేది సేవ్ పవర్ – పవర్ ప్రొడ్యూస్ అంటే కరెంట్ ను మనం ఆదాచేస్తే ఆకరెంట్ ను ఉత్పత్తి చెయ్యాల్సిన అవసరం ఉండదని అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి పంటను ప్రతీ గింజను కొంటాం అని ప్రకటించారని త్వరలోనే కల్లాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబోతున్నామని అన్నారు

కరెంట్ అనేది జీవనాధారంగా మారిపోయిందని అట్లాంటి కరెంటును పొదుపుగా వాడుకుంటేనే వనరులను రక్షించుకొనే ప్రభుత్వం గా ఉంటామని రకరకాల స్కీంలు పెట్టి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అటు వైపు సెస్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నామని అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.

వచ్చేకాలంలో కలికోట సూరమ్మ ఎత్తిపోతలను పూర్తి చేసి మూడు మండలాలకు సాగునీరు అందిస్తామని అన్నారు.ఆగస్టు మాసంలోపు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా పూర్తి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి , ఎం.పీ.పీ జవ్వాజి రేవతి , జెడ్.పీ.టీ.సీ నాగం భూమయ్య , మార్కెట్ కమిటీ చైర్మన్ గుండారపు సౌజన్య- గంగాధర్ , పాక్స్ చైర్మన్లు, సర్పంచులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube