15 ఏళ్ల క్రితం రవి ప్రకాష్ టీవీ9ను ప్రారంభించాడు.అప్పటి నుండి కూడా సీఈఓగా రవి ప్రకాష్ కొనసాగుతూ వచ్చాడు.
తన వాట తక్కువే అయినా కూడా టీవీ9 పై మొత్తం పెత్తనం అతడిదే అయ్యేలా చేసుకున్నాడు.అయితే కొత్త యాజమాన్యం రాకతో రవి ప్రకాష్ పప్పులు ఉడకలేదు.ఇన్నాళ్లు టీవీ9పై అజమాయిషీ చేసిన రవి ప్రకాష్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకున్నాడు.
టీవీ9 సీఈఓగా ఉన్న సమయంలోనే సొంతంగా ఒక ఛానెల్‌ను ఏర్పాటు చేశాడు రవి ప్రకాష్.అదే మోజోటీవీ.ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ద్వారా ఆ ఛానెల్‌కు గుర్తింపు వస్తోంది.ఇక రవి ప్రకాష్ టీవీ9 లోగోను కేవలం 99 వేల రూపాయలకు కొన్నాళ్ల క్రితం ఒక సంస్థకు అమ్మేసినట్లుగా తాజాగా పత్రాలు వెళ్లడి అయ్యాయి.టీవీ9 అంటే బ్రాండ్, ఆ లోగో కోట్ల రేట్లు పలుకుతుంది.అలాంటిది కేవలం 99 వేలకే అమ్మేడయం వెనుక ఉద్దేశ్యం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ విషయమై కొత్త యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.టీవీ9 లోగోను మెజర్టీ వాటా దారులు అయిన వారికి చెప్పకుండా అమ్మేడం జరిగింది అంటూ కేసు నమోదు అయ్యింది.తాను పెట్టిన సంస్థను మరీ ఇంత చిల్లరగా చేయడం ఏంటని కొందరు టీవీ9 ఉద్యోగస్తులే రవి ప్రకాష్ పై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.