తుర్కపల్లెలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం గ్రామ సర్పంచ్ కాసోల్ల పద్మ- దుర్గాప్రసాద్  ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల జెడ్పిటిసి గుండం నర్సయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమాదేవి పాల్గొన్నారు.

కంటి వెలుగు కార్యక్రమం చాలా గొప్పదని కంటి సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అద్దాలు ఇస్తారని తెలియజేశారు.ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ బత్తుల గీతాంజలి,వైద్య బృందం బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బాలకృష్ణ గౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రొడ్డ దేవదాస్,పార్టీ సీనియర్ నాయకులు  చందు, ప్రభుదాస్,రంజిత్,కర్రోళ్ల బాలయ్య,రాజనర్సు,ప్రవీణ్,ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు రామస్వామి, అంకని మానస, నర్సింగం, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు  తదితరులు పాల్గొన్నారు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

Latest Rajanna Sircilla News