ఒత్తైన పొడవాటి జుట్టును కోరుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉంటే మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తారు అనడంలో సందేహం లేదు.ఎందుకంటే అందాన్ని రెట్టింపు చేసే వాటిలో జుట్టు కూడా ఒకటి.

అయితే ఇటీవల కాలంలో అటువంటి జుట్టు కలిగిన వారు చాలా అరుదుగా ఉంటున్నారు.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత కారణాల వల్ల దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అసలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ఒత్తైన పొడవాటి కురులు మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శీకాకాయ పౌడర్ ను వేసుకోవాలి.

Advertisement

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్.వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ పౌడర్.

వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలిజ‌ చివరిగా రెండు టేబుల్ స్పూన్లు పెరుగు.రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ మరియు కొద్దిగా వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ దూరం అవుతుంది.

జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.హెయిర్ ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.చుండ్రు సమస్య ఉంటే త‌గ్గు ముఖం పడుతుంది.

Advertisement

తలలో దురద, ఇన్ఫెక్షన్ వంటివి ఉన్నా కూడా నయం అవుతాయి.కాబట్టి ఒత్తైన పొడవాటి జుట్టును కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు