ట్రంప్ సలహాదారుడి రాజీనామా...దరిద్రం వదిలిందనటున్న నెటిజన్లు..!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన భీకర పరిస్థితులు ఒకెత్తయితే.అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మిగిలించిన నష్టం ఇప్పటికి కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది.

అమెరికా ప్రజలు ఈ వైరస్ ను ఎంతగా ఆడిపోసుకుంటారో అంతగా ట్రంప్ ను కూడా తిట్టిపోస్తారు.కరోనా ట్రంప్ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని, మహమ్మారి వ్యాప్తికి ట్రంప్ కారకుండంటూ దుమ్మెత్తి పోస్తారు.

అయితే ట్రంప్ చేపట్టిన చర్యల వెనుక ఆయన సలహాదారుడు ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు.ట్రంప్ కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవ్వడానికి ప్రధాన కారకుడు ఆయన సలహాదారుడు స్కాట్ అట్లాస్.

కరోనా ను అరికట్టడానికి మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని, భౌతిక దూరం కూడా అక్కర్లేదని బల్లగుద్ది మరీ చెప్పిన అట్లాస్ ఇప్పుడు రాజీనామా చేశారు.కరోనా అమెరికాలో కరాళ నృత్యం చేస్తున్న సమయంలోనే ఎలాంటి అనుభవం లేని స్కాట్ ను ఎంపిక చేయడంపై ఎన్నో విమర్శలు వచ్చినా ట్రంప్ వెనకడుగు వేయలేదు.

Advertisement

అంతేకాదు కరోనా సమయంలో ప్రజలు మాస్క్ లు ధరించాల్సిన అవాసరం లేదంటూ స్కాట్ చేసిన వ్యాఖ్యలు ఎన్నో విమర్సలకు దారి తీశాయి.

లాక్ డౌన్ ని వ్యతిరేకించడం, ట్రంప్ ను తప్పు దోవ పట్టించేలా చేయడంలో స్కాట్ వ్యవహరించిన తీరు ట్రంప్ అధ్యక్ష పదవికే ఎసరు పెట్టేలా చేసింది.స్కాట్ నిర్ణయాలు సరైనవి కావని ట్రంప్ ఈ విషయంలో ఆలోచన చేయాలని అమెరికా అంటూ వ్యాధుల నిపుణుడు ఆంటోని పౌచీ కూడా విమర్శలు చేశారు.అయినా ట్రంప్ ఏ మాత్రం స్కాట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు.

మాస్క్ ల ప్రధానత తగ్గిస్తూ స్కాట్ తీసుకున్న నిర్ణయం పట్ల అమెరికాలోని ప్రజా సంఘాలు, కొందరు అధికారులు కూడా అడ్డు తగిలారు.వైట్ హౌస్ లో కూడా కరోనా తీవ్రత పెరగడానికి, ట్రంప్ సహా పలువురు అధికారులకు కరోనా సోకడానికి కూడా కారణం స్కాట్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

చివరికి అధ్యక్ష ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చెందటానికి కరోనా ఎంత కారణమో స్కాట్ కూడా అంతే కారణం అంటారు విశ్లేషకులు.అలాంటి స్కాట్ ఇప్పుడు రాజీనామా చేయడంతో వైట్ హౌస్ కు దరిద్రం వదిలిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు