TRS ప్రజా ప్రతినిధుల హామీలను వెంటనే అమలు పరచాలి - వై విక్రమ్

ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు అయ్యేలా చూడాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వై విక్రమ్ డిమాండ్ చేశారు.

పార్టీ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో NST రోడ్ (నూతన బస్టాండ్ రోడ్) వద్ద ఒక రోజు దీక్ష చేపట్టారు.

ఈ దీక్షా శిబిరాన్ని వై విక్రమ్ ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 సంవత్సరాల కాలంలో కేవలం 2300 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మాత్రమే ఇచ్చారని, మిగతా ఐదు వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇంకా ఎంతకాలం పట్టిందో జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నగరంలో పెన్షన్ లు మంజూరు చెయ్యడంలో కూడా తెరాస నాయకులు రాజకీయం చేస్తున్నారు అని, తక్షణమే అర్హత వున్నవారికి వెంటనే పెన్షన్ లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.రేషన్ కార్డులు మంజూరు చెయ్యడంలో విఫలం చెందారని ఆరోపించారు.

నగరంలో ప్రజలకు పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.రాబోయే కాలంలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ సెక్రటరీ బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, ఎండీ గౌస్, డి వీరబాబు, హుస్సేన్, భుక్యా ఉపేంద్ర, మచ్చా సూర్యం, జె వెంకన్న బాబు, ch భద్రం, రవీంద్ర, కె వెంకన్న, బిబీ, కుమారి, రాజేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

వీడియో వైరల్‌ : ఆవుల ముంగిట నెమలి నాట్యం..
Advertisement

Latest Latest News - Telugu News