భ‌ట్టితో రేవంత్‌కు చెక్ పెట్ట‌డ‌మే టీఆర్ఎస్ ప్లానా.. !

అధికార పార్టీ టీఆర్ఎస్‌కు తెలంగాణ‌లో తిరుగు లేద‌ని భావిస్తున్న త‌రుణంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొర‌క‌రాని కొయ్య‌లా త‌యార‌య్యాడు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌గ్గాలు చేజిక్కిచ్చుకున్న‌ప్ప‌టి నుంచి దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం విధిత‌మే.

మొత్తంగా సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్‌పై విరుచుకుప‌డుతూ త‌న‌దైన స్టైల్‌లో ప్ర‌శ్న‌ల‌తో ఇర‌కాటంలో పెడుతున్నాడు.అంతే కాదు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పోరాట పంథా ఎంచుకున్నారు.

ఇప్ప‌టికే పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపి అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీఆర్ఎస్‌కు ధీటుగా పోటీనిచ్చేందుకు తెగ య‌త్నిస్తున్నారు.

జోష్‌లో ఉన్న రేవంత్‌కు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ య‌త్నిస్తున్న‌ద‌ని టాక్‌.సీఎం కేసీఆర్ త‌న‌యుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కూడా రేవంత్‌పై వ్యూహం ప‌న్నిన‌ట్టు స‌మాచారం.

Advertisement

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ను హైలెట్ చేస్తూ రేవంత్‌కు చెక్ పెట్టాల‌ని కేటీఆర్ పూనుకున్నాడ‌ని తెలుస్తోంది.అందుకే స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా సీఎల్పీ నేత భ‌ట్టిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఏకంగా కాంగ్రెస్ పార్టీలో భ‌ట్టి మాట చెల్లుబాట‌వ్వ‌ట్లేద‌ని, కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఏం చేస్తున్నారో తెయ‌డం లేదంటూ సంచ‌న‌లు వాఖ్య‌లు చేశారు.తాజాగా అసెంబ్లీ లోనూ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్‌లో భ‌ట్టి మాట ఎవ‌రూ విన‌ట్లేద‌ని, అక్ర‌మార్కుల హ‌వా న‌డుస్తోందంటూ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.రేవంత్ గురించి త‌క్కువ మాట్లాడే భ‌ట్టిని లేపితే చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని కేటీఆర్ అంచ‌నా అని తెలుస్తోంది.

మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనంటూ ఆరోపిస్తున్నారు కూడా.అయితే కాంగ్రెస్‌లో ఇప్ప‌టికే అంత‌ర్గ‌త పోరు కొన‌సాగుతోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

టీపీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్‌ రెడ్డికి  మొద‌టి నుంచి ఆ పార్టీ నుంచే అస‌మ్మ‌తి సెగ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.రేవంత్ కూడా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌నే అప‌వాదు కూడా ఉంది.రేవంత్‌పై అసంతృప్తితో తాను పార్టీకి రాజీనామా చేస్తాన‌ని సీనియ‌ర్ నేత, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే.

Advertisement

ఇక భ‌ట్టితో రేవంత్‌ను ఇర‌కాటంలో పెట్టేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

తాజా వార్తలు