త్రివిక్రమ్ చేసిన పనికి షాకైన సునీల్.. 28 రూపాయలతో అలా చేయడంతో?

ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న చాలామంది సెలబ్రిటీలు కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారనే సంగతి తెలిసిందే.

కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్న సెలబ్రిటీలలో త్రివిక్రమ్, సునీల్ కూడా ఉన్నారు.

వీళ్లిద్దరూ మంచి స్నేహితులని ఒకే రూమ్ లో ఉండేవాళ్లని చాలామందికి తెలుసు.వీళ్లిద్దరూ సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

త్రివిక్రమ్ ఒక సందర్భంలో డబ్బు, భయం గురించి చెబుతూ ఈ విషయాలను వెల్లడించారు.తాను, సునీల్ లక్డీకపూల్ లోని అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని సరైన సమయానికి అద్దె చెల్లించకపోవడంతో రూమ్ ఖాళీ చేయాలని చెప్పాడని త్రివిక్రమ్ తెలిపారు.

ఓనర్ అలా చెప్పిన సమయంలో నా జేబులో 28 రూపాయలు ఉండేవని తాను రెండు సిగరెట్లు కాల్చడంతో రెండు రూపాయలు ఖర్చై జేబులో 28 రూపాయలు ఉన్నాయని ఆయన తెలిపారు.సునీల్ తర్వాత రోజు 28 రూపాయలతో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా చేయాలో ఆలోచిస్తుండగా తాను 28 రూపాయలు ఖర్చు చేసి కూల్ డ్రింక్ టిన్స్ ను కొనుగోలు చేయడంతో సునీల్ షాకయ్యాడని త్రివిక్రమ్ చెప్పుకొక్ఛారు.

Advertisement
Trivikram Shocking Comments About Incident With Sunil Details Here , Incident Wi

మొత్తం డబ్బులతో కూల్ డ్రింక్స్ కొంటే రేపు ఎలా తింటామని సునీల్ అన్నాడని త్రివిక్రమ్ పేర్కొన్నారు.తాను డబ్బు లేదని రేపటినుంచి ఆలోచించాల్సిన అవసరం ఏమిటని ఇప్పటినుంచి ఆలోచిద్దామని చెప్పానని త్రివిక్రమ్ కామెంట్లు చేశారు.

Trivikram Shocking Comments About Incident With Sunil Details Here , Incident Wi

మనుషులు భయపడితే దారులు ఉన్నా కనిపించవని విషమ పరిస్థితులు ఎదురైతే కంగారు పడటంలో తప్పు లేదని భయపడకూడదని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.భయాన్ని వదిలేసి ధైర్యంతో ముందడుగు వేస్తే అనుకున్నది సాధించడం సాధ్యమేనని త్రివిక్రమ్ వెల్లడించారు.త్రివిక్రమ్ స్నేహితుడు సునీల్ సినిమాలలో వేర్వేరు పాత్రల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు