ఆర్ఆర్ఆర్ ఆలస్యానికి త్రివిక్రమ్ మందు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో తారక్ చేస్తున్న కొమురం భీం పాత్ర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలో తారక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తారక్ పుట్టినరోజున రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను ప్రారంభించిన చిత్ర యూనిట్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.అయితే తారక్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ ఇప్పటికే ఆలస్యం కావడంతో వచ్చే జనవరి 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Advertisement

అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా జనవరిలో కూడా రిలీజ్ అవుతుందో లేదో అనే సందేహం నెలకొంది.ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుండటంతో ఈ సినిమాను వచ్చే జూలైలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

అయితే ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తారక్ సినిమాను కేవలం 11 నెలల్లో పూర్తి చేసి రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నారు.దీంతో ఆర్ఆర్ఆర్ కంటే ముందే త్రివిక్రమ్-తారక్ చిత్రం రిలీజ్ కావడం ఖాయమని అంటున్నాయి చిత్ర వర్గాలు.

మరి నిజంగానే ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు జక్కన్న సమాధానం ఇచ్చే వరకు ఆగాల్సిందే.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు