Trivikram : పాపం ఆ హీరోయిన్స్… త్రివిక్రమ్ ని నమ్ముకుని మోసపోతున్నారా ?

దర్శకులందరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న డిమాండ్ వేరు.ఆయన సినిమా వస్తుంది అంటే అందరూ రిపీట్ మూడ్ లో పెట్టుకొని మరీ చూస్తూ ఉంటారు.

ఆయన సినిమాల్లో వాడే పుంచ్ లైన్లకి కూడా మంచి గిరాకీ ఉంటుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పిచ్చి క్రేజ్ ఉన్న అభిమానులు ఎంతోమంది ఉన్నారు.

అంతలా ఆయన మార్కు సినిమాల్లో మాత్రమే కాదు అభిమానుల్లో కూడా ఉంటుంది.ఇక తాజాగా ఆయన తీసిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

అయితే ఈ చిత్రంలో మాత్రం త్రివిక్రమ్ మార్కు ఏ విధంగానూ కనిపించలేదు.

Advertisement

మరి ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) సినిమా వస్తుంది అంటే అందులో చాలా పెద్ద క్యాస్ట్ ఉండే తీరుతుంది.తీసుకున్న అందరికీ మంచి స్కోప్ కూడా లభిస్తుంది.అయితే గత మూడు నాలుగు చిత్రాలుగా త్రివిక్రమ్ ఒక తప్పును చేస్తూనే వస్తున్నాడు.

అదేంటంటే సెకండ్ హీరోయిన్స్ ని తీసుకొని వారికి ఎలాంటి ప్రాధాన్యతను పెట్టలేకపోతున్నాడు.ఉదాహరణకు మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary )ని తీసుకుందాం.

ఆమె గుంటూరు కారం సినిమాలో ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఉండదు.మూడు నాలుగు సీన్స్ కి మించి ఆమెకు ఎలాంటి అవకాశం కూడా లభించలేదు.

హీరోకి భుజం నొక్కడం లేదంటే ఆమ్లెట్ వేయడం తప్ప ఆమె ఎందుకు పనికిరాని ఒక పాత్ర చేయాల్సి వచ్చింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కేవలం మీనాక్షి చౌదరి మాత్రమే కాదు ఇంతకు ముందు అరవింద సమేత( Aravinda Sametha ) చిత్రంలో ఈషా రెబ్బ కూడా దాదాపు ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రనే చేసింది.అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలో కూడా నివేదా పేతురాజు ఉంటుంది.కానీ ఆమె పాత్ర కూడా దాదాపు ఎలాంటి ప్రభావాన్ని సినిమాపై చూపించలేకపోయింది.

Advertisement

ఈ ముగ్గురు సెకండ్ హీరోయిన్స్ కేవలం త్రివిక్రమ్ సినిమాలో నటించాము అని చెప్పుకోడానికి మాత్రమే పనికి వచ్చింది కానీ ఏ రకంగానూ వారికి ఈ సినిమా ద్వారా సక్సెస్ లభించలేదు.గుర్తింపు అంతకన్నా దొరకలేదు.

తాజా వార్తలు