సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరో 15 రోజుల్లో మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.
సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ చేస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Kaaram ).ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడు రికార్డులు బద్దలు కొడదామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అటు ఆడియెన్స్ తో పాటు ఇటు ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమా షూట్ మొత్తం ఇప్పటికే పూర్తి చేసుకుని మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు.
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే సగానికి పైగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయని మిగిలిన సగం కూడా త్వరలోనే పూర్తి చేయనున్నట్టు సమాచారం.
మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేష్ ఎప్పుడు జాయిన్ అవుతాడో చూడాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల ( SreeLeela) , మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.







