Salaar Movie : తెలుగు రాష్ట్రాలలో సలార్ ఆ రికార్డ్ సాధించడం సాధ్యమేనా.. ఎంతో కష్టపడాలంటూ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్( prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం సలార్( Salaar movie ).ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Prabhas Salaar Movie Collections High-TeluguStop.com

ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే 500 కోట్లకి పైగా కలెక్షన్స్ ని దాటేసి జైలర్ రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా సలార్ మూవీ దూసుకుపోతోంది.

నార్త్ ఇండియాలో కూడా కలెక్షన్స్ పుంజుకుంటున్నాయి.ఈ వీకెండ్ మొత్తం సలార్ కి కలిసొచ్చే అవకాశం ఉంది.

డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లే అని భావిస్తున్నారు.

Telugu Bahubali, Prabhas, Salaar, Shruti Haasan, Telugu, Tollywood-Movie

ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగులో ఇప్పటి వరకు 290 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేసింది.సౌత్ ఇండియాలో తమిళంతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాలలో మూవీ మార్కెట్ పెద్దదని అందరూ భావిస్తూ ఉంటారు.తెలుగు ఆడియన్స్ అన్ని సినిమాలు చూడటానికి ఇష్టపడతారు.

బాషాబేధం ఉండదు.అందుకే ఇతర భాషా చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు సాధిస్తాయి.

తెలుగు సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే సాలిడ్ కలెక్షన్స్ వస్తాయి.అయితే ఈ ఏడాది కోలీవుడ్ నుంచి జైలర్, లియో సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అవి పంక్తు కమర్షియల్ హీరోయిక్ మూవీస్.చెప్పుకోదగ్గ కథ, కథనాలు లేవు.

Telugu Bahubali, Prabhas, Salaar, Shruti Haasan, Telugu, Tollywood-Movie

అయిన కూడా కేవలం తమిళంలోనే ఆ సినిమాలు 500 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. సలార్( Salaar movie ) తో పోల్చుకుంటే రెండు సినిమాలు బడ్జెట్ పరంగా గాని విజువల్ ప్రెజెంటేషన్ పరంగా కాని తక్కువలోనే ఉంటాయి.అయితే సలార్ మూవీ ఇప్పటికి తెలుగు రాష్ట్రాలలో 500 కోట్ల మార్క్ ని టచ్ చేయలేకపోయింది.కేవలం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2,( Bahubali 2 ) ఆర్ఆర్ఆర్ సినిమాలు మాత్రమే తెలుగులో 500 కోట్లు కలెక్ట్ చేశాయి.

ఇప్పుడు సలార్ కూడా లాంగ్ రన్ లో 450 నుంచి 500 కోట్ల మధ్యనే తెలుగు రాష్ట్రాలలో కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఈ లెక్కల బట్టి సలార్ సినిమా ద్వారా మన తెలుగు రాష్ట్రాల మార్కెట్ తమిళం కంటే తక్కువ అనే క్లారిటీ వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube