నితిన్‌ కోసం త్రివిక్రమ్‌.. రష్మిక రిక్వెస్ట్‌ చేసిందా?

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ చిత్రం వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నితిన్‌కు జోడీగా ఈ చిత్రంలో రష్మిక మందన్న నటించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

 Trivikram Attend The Bheeshma Pree Release Event-TeluguStop.com

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు.ఈనెల 17వ తారీకున భీష్మ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్‌ చేశారు.

ఈ వేడుకలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Bheeshma Latest, Bheeshma Pree, Trivikram-Movie

నితిన్‌ గతంలో త్రివిక్రమ్‌తో వర్క్‌ చేశాడు.ఆ సన్నిహిత్యంతో ఈ వేడుకలో త్రివిక్రమ్‌ హాజరు అయ్యేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.ఇదే సమయంలో తాజాగా ఒక కార్యక్రమంలో కలిసిన సందర్బంగా భీష్మ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరు అవ్వాల్సిందిగా హీరోయిన్‌ రష్మిక స్వయంగా రిక్వెస్ట్‌ చేసిందట.

హీరో మరియు హీరోయిన్‌ పిలుపు మేరకు దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ వేడుకలో హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నారు.

Telugu Bheeshma Latest, Bheeshma Pree, Trivikram-Movie

భారీ అంచనాల నడుమ రూపొందిన భీష్మ చిత్రంలోని సింగిల్‌ అంటూ సాగే పాట నిన్న వాలెంటైన్స్‌ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ పాటకు చాలా మంది కనెక్ట్‌ అవుతున్నారు.పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

త్రివిక్రమ్‌ ఎంట్రీతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube