నితిన్‌ కోసం త్రివిక్రమ్‌.. రష్మిక రిక్వెస్ట్‌ చేసిందా?

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ చిత్రం వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నితిన్‌కు జోడీగా ఈ చిత్రంలో రష్మిక మందన్న నటించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు.ఈనెల 17వ తారీకున భీష్మ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్‌ చేశారు.

ఈ వేడుకలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. """/"/నితిన్‌ గతంలో త్రివిక్రమ్‌తో వర్క్‌ చేశాడు.

ఆ సన్నిహిత్యంతో ఈ వేడుకలో త్రివిక్రమ్‌ హాజరు అయ్యేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

ఇదే సమయంలో తాజాగా ఒక కార్యక్రమంలో కలిసిన సందర్బంగా భీష్మ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరు అవ్వాల్సిందిగా హీరోయిన్‌ రష్మిక స్వయంగా రిక్వెస్ట్‌ చేసిందట.

హీరో మరియు హీరోయిన్‌ పిలుపు మేరకు దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ వేడుకలో హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నారు.

"""/"/భారీ అంచనాల నడుమ రూపొందిన భీష్మ చిత్రంలోని సింగిల్‌ అంటూ సాగే పాట నిన్న వాలెంటైన్స్‌ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ పాటకు చాలా మంది కనెక్ట్‌ అవుతున్నారు.పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

త్రివిక్రమ్‌ ఎంట్రీతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓరి మీ దుంపతెగ.. అంత్యక్రియల్లో నవ్వులు, డ్యాన్సులేంట్రా.. (వీడియో)