ట్రాన్స్ జెండర్లు పూజించే ముర్గి మాత గురించి తెలుసా..?

ట్రాన్స్ జెండర్లు( Transgenders ) భక్తిశ్రద్ధలతో ముర్గిమాత పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.

విశాఖలో( Vishakapatnam ) జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు రెండువేల మంది ట్రాన్స్ జెండర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మూడు రోజులపాటు సమావేశాలను కూడా నిర్వహించారు.ముగింపు ఉత్సవాన్ని రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీనివాస కళ్యాణం మండపంలో నిర్వహించారు.

ముర్గీ మాత( Murgi Mata ) అంటే ట్రాన్స్ జెండర్ల ఆరాధ్య దేవత.తమ కమ్యూనిటీకి ముర్గిమాత దైవంగా కొలుస్తుంటారు.

ముర్గిమాత ఉత్సవం సమయంలో ట్రాన్స్ జెండర్లు అంతా ఓకే చోట చేరుతారు.అలాగే భక్తిశ్రద్ధలతో ముర్గిమాత కు పూజలు చేస్తారు.

Transgenders Celebrates Murgi Mata Festival In Vizag Details, Transgenders ,murg
Advertisement
Transgenders Celebrates Murgi Mata Festival In Vizag Details, Transgenders ,murg

నిష్ఠతో దీక్షలు చేసి అమ్మవారికి పండ్లు ఫలహారాలు నైవేద్యంగా పెట్టి పూజిస్తారు.కమ్యూనిటీలో కొత్తగా చేరే వారిని ఆహ్వానిస్తూ సంబరాలు చేసుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ముర్గిమాత పండుగలో ప్రధాన ఘట్టం పూజా.

తమ ఇష్టదైవాన్ని ఆరాధించే ప్రాంతంలో ముర్గీ మాతకు నిష్టతో పూజ( Murgimata Pooja ) చేస్తారు.సమాజమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు.

సమాజం బాగుంటేనే అందులో తము కూడా సుఖంగా ఉంటాం అనేది వారి భావన.ఎందుకంటే తమకు దానం చేసేవాళ్లంతా సుభిక్షంగా ఉంటేనే తమ జీవనం ముందుకు సాగుతుందనేది వారి నమ్మకం.

అందుకే ఈ పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తారు.అందరూ ఒకే చోట చేరి పూజలు కూడా చేస్తారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మీ వీర్యం మీ చేతుల్లోనే ఉంది

కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు.

Transgenders Celebrates Murgi Mata Festival In Vizag Details, Transgenders ,murg
Advertisement

అందరూ కలిసి విందు ఆరగిస్తారు.వేడుకలను సంతోషంగా జరుపుకొని ఆడి పాడుతారు.ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ట్రాన్స్ జెండర్స్ ప్రొటెక్షన్ నోడల్ ఆఫీసర్, దిశ ఏసీపీ వివేకానంద( Disha ACP Vivekananda ) హాజరయ్యారు.

ఏపీ సిఐడి తయారు చేయించిన స్వాభిమాన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ సంరక్షణ సంస్థ ఏపీ పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలన్నీ వివరించారు.సమస్యలను పరిష్కరిష్కారానికి రక్షణ కోసం ఇప్పటికే 1090 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారని ఏసీపీ వివేకానంద తెలిపారు.

అలాగే ట్రాన్స్ జెండర్లు విలువలతో కూడిన జీవనం సాగించాలని ఏసీపీ వివేకానంద కోరారు.సమాజానికి ఉపయోగపడేలా పలు మంచి కార్యక్రమాలు చేపట్టాలని అనైతిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపారు.

తాజా వార్తలు