పుష్ప సినిమా కోసం ట్రాన్స్ జెండర్ హీరోయిన్ దించుతున్న సుకుమార్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ తెరకేక్కబోతున్న సినిమా పుష్ప.చిత్తూరు నేపధ్యంలో నడిచే కథాంశంగా ఈ సినిమా మాస్ మసాలా మూవీగా ఉండబోతుంది.

ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో కథ నడుస్తుందని సమాచారం.

Transgender Actress Anjali Ameer Negative Role In Pushpa Movie, Tollywood, Malay

ఇక తాజాగా ఈ సినిమాక్కి సంబందించిన టైటిల్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ లని సుకుమార్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.మొత్తం ఐదు భాషలలో పాన్ ఇండియా మూవీగా దీనిని తీసుకురాబోతున్నారు.

ఇక లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీలకి చెందిన నటులని కీలక పాత్రల కోసం ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

సినిమాకి కావాల్సిన మార్కెట్ కోసం సౌత్ భాషలతో పాటు, హిందీకి చెందిన స్టార్ కాస్టింగ్ ని సుకుమార్ ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన సమాచారం ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.

మలయాళంలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ట్రాన్స్ జెండర్ యాక్టర్ అంజలి అమీన్ ని పుష్ప సినిమాలో ఒక నెగిటివ్ రోల్ కోసం సుకుమార్ ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది.మలయాళంలో మమ్ముట్టి పక్కన హీరోయిన్ గా నటించిన అంజలి అమీన్ కి అక్కడ మంచి గుర్తింపు ఉంది.

ఈ నటిని తీసుకుంటే సినిమాకి అదనపు ప్రమోషన్ కూడా వస్తుందని సుకుమార్ సినిమాలో కీలకమైన లేడీ విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తుంది.మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

.

నేను ధనవంతురాలిని కాదు....నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు