జడ్పీటీసీ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ లో శిక్షణ

బోయినిపల్లి:స్టడీ స్కిల్స్ పైన బోయిన్పల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

శుక్రవారం మోడల్ స్కూల్ లో 10వ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2వ విడుత ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.

ప్రముఖ వెక్టార్ అకాడమీ చైర్మన్,మాస్టర్ ట్రైనర్ అనంత పద్మనాభస్వామి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్బంగా కత్తెరపాక ఉమకొండయ్య మాట్లాడుతూ, వార్షిక పరీక్షలు సిద్ధపడుతున్న విద్యార్థులకు ఇలాంటి శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతున్నదని, దీని ద్వారా విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు అని ఆశిస్తున్నా అని అన్నారు.

పద్మనాభస్వామి కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మాస్టర్ ట్రైనర్ స్వామి మాట్లాడుతూ, పరీక్షా సమయంలో ఈ శిక్షణ వారికి ఎంతో ధైర్యంన్ని అందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైనర్ శ్రావణి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Advertisement
కనుమ పండుగ రోజు ప్రయాణం ఎందుకు చెయ్యకూడదు?

Latest Rajanna Sircilla News