ఇక మనుషులతో పనిలేదు... పొలాల్లో కలుపు తీయడానికి ఏఐ రోబోట్స్‌ వచ్చేస్తున్నాయోచ్!

స్మార్ట్ యుగంలో మనిషికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.రోజురోజుకీ పెరిగిపోతున్న టెక్నాలజీ( Technology ) అనేక నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువు అయింది.

ఈ క్రమంలో మనిషి తన మేధా శక్తితో అనేక ఇన్నోవేషన్స్ తో ముందుకు పోతున్నాడు.ఎంతో విలువైన కాలాన్ని సద్వినియోగ పరుచుకోవడంలో సఫలుడు అయ్యాడు.

ఎలాగంటే ఒకప్పుడు ఒక ఎకరా పొలం దున్నడానికి పదిమంది కూలీలు పది గంటలు పాటు శ్రమించి వలసి వచ్చేది.కానీ నేడు ఒక్క యంత్రం సాయంతో రెండుమూడు గంటల వ్యవధిలో అదే పొలాన్ని దున్నగలుగు తున్నాము.

ఒకప్పుడు ఎరువుల్ని కూడా మనుషుల సాయంతో చల్లేవాళ్ళం.ఇపుడు దానిని కూడా యంత్రం సాయంతో చాలా త్వరిత గతిన చేసుకోగలుగుతున్నాం.ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి ఇన్నోవేషన్స్ కి అంతే లేదు.

Advertisement

వివిధ రంగాల్లో, వివిధ రకాలుగా, వివిధ పనులను యంత్రాల సాయంతో ఇపుడు క్షణాల్లో పూర్తిచేసే పరిస్థితి వుంది.దానికి కారణం మనిషి కనిపెట్టిన టెక్నాలజీనే.అదే టెక్నాలజీ నేడు వివిధ రంగాల్లో రోబోటిక్స్ ని( Robotics ) ప్రవేశపెట్టి చేయవలసిన పనులను ఇంకా సులభతరం చేశాయని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలోనే వ్యవసాయ సాంకేతిక పరికరాల తయారీ కంపెనీ అయినటువంటి ‘ఫార్మ్‌వైస్‌’( Farmwise ) మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిపుణుల సాయంతో రైతులకు పనికొచ్చే సరికొత్త పరికరాన్ని రూపొందించింది.పొలంలోని కలుపును ఏరిపారేసే రోబోను ‘వల్కన్‌’ ( Vulcan ) పేరుతో రూపొందించింది.ఈ రోబో పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేయడం విశేషం.

ఇందులోని ‘ఇంటెలిజెంట్‌ ప్లాంట్‌ స్కానర్‌’ పనికొచ్చే మొక్కలేవో, పనికిరాని కలుపుమొక్కలేవో కచ్చితంగా గుర్తించగలదు.కలుపు మొక్కలను ఇట్టే గుర్తించి, వాటిని క్షణాల్లోనే సమూలంగా ఏరిపారేస్తుంది.

దీనిని ట్రాక్టర్‌కు అమర్చుకుని, పొలంలో ఒకసారి ఇటూ అటూ నడిపితే చాలు, మొత్తం కలుపునంతటినీ పూర్తిగా నాశనం చేస్తుంది.

టమాటా నారు పెంపకంలో పాటించాల్సిన సరైన యాజమాన్య పద్ధతులు..!
Advertisement

తాజా వార్తలు