నేడు టీపీసీసీ విస్తృత సమావేశం

హైదరాబాద్ : మే 22 నేడు టిపిసిసి విస్తృత సమావేశం సోమవారం జరుగనుంది.

గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యవర్గం, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, టీపీసీసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణతోపాటు తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.

యుగంధర్‌కు ఫోన్లో రేవంత్‌ పరామర్శ

ఉప్పల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యుగంధర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివారం ఫోన్‌ చేసి పరామర్శించారు.ఈ సందర్భంగా తనపై దాడి జరిగిన పూర్వా పరాలను రేవంత్‌కు యుగంధర్‌ వివరించారు.

భయపడాల్సిన పని లేదని, కాంగ్రెస్‌ అండగా ఉంటుందని ఆయనకు రేవంత్‌ భరోసానిచ్చారు.

Advertisement
గేమ్‌ ఛేంజర్‌ ‘దోప్‌’ సాంగ్‌ విడుదల.. డాన్సుతో మెస్మరైజ్ చేసిన గ్లోబల్ స్టార్

Latest Hyderabad News