హైదరాబాద్ లో కుండపోత వర్షం రోడ్లన్నీ జలమయం..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాల రాకతో పాటు విస్తరించడంతో పలుచోట్ల వర్షాలు( Rains ) భారీగా కురుస్తున్నాయి.

వారం రోజుల క్రితం తీవ్ర ఎండ వేడిమితో వడగాల్పులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది.

అయితే రుతుపవనాల రాకతో రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.చాలాచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి.

కాగా శనివారం హైదరాబాద్ లో( Hyderabad ) కుండపోత వర్షం కురవటం జరిగింది.పటాన్ చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కుక్కట్ పల్లి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లకిడికపూల్, కోటి, సికింద్రాబాద్, బేగంపేట, దిల్ షుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, తో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.పలుచోట్ల ట్రాఫిక్ జామ్( Traffic Jam ) అయింది.దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

మరోపక్క హైదరాబాద్ విపత్తుల నిర్వహణ శాఖ అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించడం జరిగింది.ఇదే సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాత్రికి మరింతగా వర్షం కురిసే అవకాశం ఉందని అంటున్నారు.

వర్షం భారీగా కురవటంతో హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది.

దీంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని జిహెచ్ఎంసి సైతం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు