ఎన్టీఆర్ పరిస్థితి దారుణం.. బాలయ్య కాకుంటే బాగుండేది

నందమూరి తారకరామారావు బయోపిక్ "ఎన్టీఆర్" సినిమా సంక్రాంతి కానుకగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ దక్కింది.

భారీ అంచనాల నడవ వచ్చిన సినిమా అవ్వడంతో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.కానీ సినిమాకు లాంగ్ రన్.లో కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు.టాక్ కు వచ్చే కలెక్షన్స్ కు ఎక్కడ కూడా పోలిక ఉన్నట్లుగా అనిపించడం లేదు.

మహానటి సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది.ఆ స్థాయిలో ఎన్టీఆర్ కూడా రాబట్టడం ఖాయం అనుకున్నారు.

కానీ సినిమా మాత్రం ఎన్టీఆర్ ఆశించిన స్థాయిలో వసూళ్లనాయు రాబట్టలేక పోయింది.

Advertisement

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా భారీ ఎత్తున విడుదల అయ్యింది.సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను చూస్తే సినిమా కేవలం వారం రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టడం ఖాయం అనుకున్నారు.కానీ ఈ సినిమా మాత్రం డిస్టిబ్యూటర్లకు తీవ్రమైన నష్టాలను మిగిల్చే అవకాశం కనిపిస్తోంది.

రెండవ పార్ట్ మహానాయకుడు కూడా విడుదల అయితే అప్పుడు కానీ డిస్టిబ్యూటర్లకు కాస్త ఊరట దక్కే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా వసూళ్లు ఎందుకు రాబట్టలేక పోతుందని అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.కొందరు మాత్రం ఈ సినిమాను బాలకృష్ణ తీయడం వల్ల పెద్దగా పట్టించుకోవడం లేదని, అదే ఈ సినిమాను మరెవ్వరైన తీసి ఉంటే ఖచ్చితంగా పరిస్థితి వేరేగా ఉండేదంటున్నారు.ఎన్టీఆర్ సినిమాలో కేవలం పాజిటివ్స్ మాత్రమే చూపించారు.

నెగటివ్స్ మాత్రం వదిలేశారు.నెగటివ్ అంశాలను కూడా ఈ సినిమాలో చూపిస్తే బాగుండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు