తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.సీనియర్ నటుడు శరత్ బాబు( Actor Sarath Babu ) కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.నెల రోజులకు పైగా ఏఐజీ ఆస్పత్రిలో( AIG Hospital ) చికిత్స కొనసాగింది.
ఈ నేపథ్యంలో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో శరత్ బాబు కన్నుమూశారని తెలుస్తోంది.
1951 జూలై 31న జన్మించిన శరత్ బాబు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస.చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన సుమారు 220 కి పైగా సినిమాల్లో నటించారు.తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.