సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.ఇటీవలే సర్కారు వారి పాట వంటి ఘన విజయం అందుకున్న తర్వాత మహేష్ చేస్తున్న కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.అలాగే ఈ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.మూడవసారి కూడా రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై ఇంకా హోప్స్ పెరిగాయి.ఇక ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని మొన్నటి వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంది.ముందు నుండి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ కు తాజాగా బ్రేక్ ఇచ్చారు.
అయితే ప్రజెంట్ ఈ సినిమా కొద్దిగా బ్రేక్ తీసుకున్నారు.

వచ్చే నెల జూన్ 7 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుంది అని తెలుస్తుంది.ఇదిలా ఉండగా మహేష్ బాబు మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు.దీనిని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ ను కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో కూడా పలువురు బాలీవుడ్ స్టార్స్ పేరు వినిపించగా తాజాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్( Akshay kumar ) పేరు వినిపిస్తుంది.
ఈ సీనియర్ స్టార్ హీరో మహేష్ సినిమాలో కీలక రోల్ లో నటిస్తున్నాడు అని తాజా టాక్.మరి ఈయన నిజంగానే ఉన్నాడా? ఉంటే ఏ పాత్రలో కనిపిస్తాడు? అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక జగపతిబాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.







