ఈ టాలీవుడ్ సినిమాలు సైన్స్ పాఠాలు నేర్పుతాయి.. కానీ..?

సాధారణంగా సినిమాలనేవి నిజజీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి రిలీఫ్ అందించడానికి ఒక మార్గంగా నిలుస్తుంటాయి.చాలామంది టైమ్‌ పాస్‌కి కూడా సినిమాలు చూస్తారు.

అయితే ఈ రోజుల్లో ఓన్లీ టైమ్‌పాస్‌కి మాత్రమే కాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా సినిమాలను చూస్తున్నారు.దర్శకులు చాలా కంటెంట్ ఉన్న సినిమాలు తీయడం వల్ల వీటిని చూస్తుంటే మనకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

హాలీవుడ్ సినిమాలు ఇలాంటివి కొత్త రకమైన కాన్సెప్ట్‌లను తీసుకొస్తూ ఉంటాయి ఇప్పుడు మన టాలీవుడ్ సినిమాలు కూడా సైన్స్( Science ) గురించి కొత్త విషయాలు తెలిపే కథలతో వస్తున్నాయి.వీటిని చూస్తే మనకు చాలా కిక్కు వస్తుంది.

అంతేకాకుండా ఎన్నో సంగతులు తెలుసుకోవచ్చు.ఆ సినిమాలేవో తెలుసుకుందాం.

Advertisement

• ప్రాజెక్టు జెడ్

2016లో రిలీజ్ అయిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం ప్రాజెక్టు జెడ్( Project Z ) సినిమాను రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు.ఈ సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల వరకు ఏంటి ఈ గోల అని అనిపిస్తుంది.

తర్వాత మాత్రం సైంటిఫిక్ మిస్టరీలు రివిల్ చేస్తుంటే మతిపోతుంది.ఈ చిత్రంలో సందీప్ కిషన్,( Sundeep Kishan ) లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) నటించారు స్మాల్ బడ్జెట్ పై తెరకెక్కినా ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్ చేస్తుంది.

C.V.కుమార్ ఈ మూవీని అద్భుతంగా డైరెక్ట్ చేశాడనే చెప్పాలి.

• ప్రసన్నవదనం

ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో హీరో సుహాస్‌కు( Suhas ) కళ్లు ఉంటాయి కానీ ముఖాలను మాత్రం గుర్తించలేడు.అతడికి ఇతరుల బాడీ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి.కానీ ఫేస్ మాత్రం అసలు కనిపించదు.

ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?
ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?

ఫేస్ ఒక వెరైటీ ఆకారంలో కనిపిస్తుంది.నిజానికి అద్దంలో కనిపించే తన ఫేస్ ను కూడా అతను గుర్తించలేడు.

Advertisement

అదే ఎందుకు అని తెలుసుకునే లోపు అతడు ఒక మర్డర్ కేసు మిస్టరీలో ఇరుక్కుంటాడు.దాని తర్వాత సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది, ప్రసన్న వదనం (2024)( Prasanna Vadanam ) ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

దీన్ని తప్పక చూడాల్సిందే.

• ఆరంభం

సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసేవారికి ఆరంభం సినిమా( Aarambham Movie ) చాలా బాగా నచ్చుతుంది.అలాగే ఊరికే సినిమాలు చూడకుండా అందులోని సన్నివేశాల గురించి బాగా ఆలోచించే వారికి ఇది బెస్ట్ మూవీ అవుతుంది.చాలా కొత్త సైన్స్ కాన్సెప్టులతో ఈ మూవీ తెరకెక్కింది.

తాజా వార్తలు