అదిరిపోయే ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అందించిన 3 సినిమాలు..!

ఇటీవల కాలంలో ఒక నెల వ్యవధిలోనే చాలా సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.అవన్నీ కొన్ని వారాలలోనే ఓటీటీల్లో( OTT ) కూడా వచ్చేస్తున్నాయి.

ఇవన్నీ ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించగల వెసులుబాటు ప్రేక్షకులకు లభిస్తుంది.అయితే ఈ ఏడాది రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో మూడు సినిమాలు మాత్రం అదిరిపోయే ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తున్నాయి.

ఈ సినిమాలను ఓటీటీలో ఇప్పుడే చూసేయవచ్చు.అవేవో తెలుసుకుందాం.

• ఎలక్షన్

( Election ) తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ "ఎలక్షన్ (2024)" చాలామందిని ఆకట్టుకుంది.రాజకీయాల్లో అడుగుపెడితే మోసపోవటం ఖాయం అని, పాలిటిక్స్‌లోకి దిగడం బురదలోకి దిగిన దానితో సమానం అని ఈ సినిమాలో చూపించారు.

Advertisement

ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ నడరాసన్ ( Nadarasan )రాజకీయాలను పట్టించుకోడు, కానీ అతను తన తండ్రిని గర్వించేలా పంచాయతీ లీడర్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఎన్నికల ప్రక్రియలో హింస, ప్రత్యర్థుల నుండి పోటీ, నమ్మకద్రోహం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు.

దీన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు.

• మహారాజా

( Maharaja ) యాక్షన్ థ్రిల్లర్ మూవీ "మహారాజా (2024)" బ్లాక్ బస్టర్ హిట్ అయింది.నితిలన్ స్వామినాథన్ ( Nithilan Swaminathan )దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) నటించాడు.ఇందులో మహారాజా చెన్నైలోని ఓ సెలూన్‌లో బార్బర్‌గా పనిచేస్తుంటాడు.

ఒకరోజు ఒక పెద్ద ట్రక్కు వచ్చి అతడి ఇంటిని ఇంటికి కొడుతుంది అందులో అతను భార్య చనిపోతుంది కూతురు మాత్రం బతికి పోతుంది.తర్వాత విజయ్ సేతుపతి పాస్ట్ ప్రెసెంట్ చాలా చక్కగా అల్లి ఈ సినిమాని తీశారు.

మునుపెన్నడూ చూడని స్టంట్‌.. ఒకేసారి అంత మంది పైనుంచి దూకిన వేక్‌బోర్డర్..?
వరద బాధితులకు 600 విరాళం.. డిప్యూటీ సీఎం రియాక్షన్ ఏంటో తెలుసా?

ఇందులో విజయ్ సేతుపతి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.అతనికి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అని పేర్కొనవచ్చు.

Advertisement

ఈ మూవీలోని ట్విస్టులు చాలా బాగా ఎంటర్‌టైన్‌ చేస్తాయి.ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

• ది గోట్ లైఫ్‌

( The Goat Life ) ఆడుజీవితం లేదా ది గోట్ లైఫ్‌గా 2024లో రిలీజ్ అయిన మలయాళ సర్వైవల్ డ్రామా సూపర్ హిట్ అయింది.ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించాడు.ఇందులో నజీబ్ ముహమ్మద్ (పృథ్వీరాజ్) అనే భారతీయ కూలీ తన కుటుంబానికి లక్షల్లో డబ్బు పంపాలనే ఉద్దేశంతో సౌదీ అరేబియాకు వెళ్తాడు.

కానీ అక్కడ అతను ఎడారిలో చిక్కుకుపోతాడు.అక్కడే మేకలను మేపుతూ బానిస లాంటి జీవితాన్ని గడుగుతాడు.ఇదొక ఒక పర్సన్ రియల్ లైఫ్ ఆధారంగా తీశారు.

ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

తాజా వార్తలు