జగన్ నిర్ణయం తీసుకునే వరకు టాలీవుడ్‌ లో బిజినెస్‌ బంద్‌

టాలీవుడ్‌ లో కరోనా థర్డ్ వేవ్‌ తర్వాత మళ్లీ సినిమాల జాతర మొదలు అయింది.

మార్చి నుండి మొదలుకొని ఏప్రిల్ మే వరకు వరుసగా సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఈ మూడు నెలల్లో ఏకంగా 20 భారీ నుంచి అతి భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.అయితే ఈ సమయం లో ఇండస్ట్రీ వర్గాల వారిని ఒకటే సమస్య ఇబ్బందికి గురి చేస్తుంది.

అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల టికెట్ల రేట్లు విషయం.సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ విషయం పై ఎప్పటి వరకు క్లారిటీ ఇస్తాడు అనేది తెలియడం లేదు.

ప్రస్తుతం ఉన్న టిక్కెట్ల రేట్ల తో సినిమాలను విడుదల చెయ్యలేము అంటూ ఇప్పటికే బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కొందరు చేతులు ఎత్తేశారు.పెద్ద హీరోల సినిమాలు కనుక కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Advertisement

అంత భారీ మొత్తంతో కొనుగోలు చేసి ఏపీలో విడుదల చేయాలంటే ప్రస్తుతానికి మా వల్ల కాదు అంటున్నారు.దాంతో సినిమాల బిజినెస్ వ్యవహారాలు ఏపీలో ఆగిపోయినట్లు అయింది.

త్వరలో విడుదల కాబోతున్న చాలా సినిమాలు ఇంకా ఏపీలో అమ్ముడు పోలేదు అనే టాక్‌ వినిపిస్తుంది.కారణం టిక్కెట్ల రేట్ల విషయంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టికెట్ల రేట్లను బట్టి సినిమాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.కొంత మంది నిర్మాతలు కూడా టికెట్ల రేట్లు క్లారిటీ వచ్చిన తర్వాతే ఏపీలో తమ సినిమాని అమ్మాలని భావిస్తున్నారు.

అందుకే ఏపీలో టికెట్ల రేట్లు విషయం పై క్లారిటీ వచ్చే వరకు టాలీవుడ్ లో సినిమాల బిజినెస్ లు ఆగిపోయినట్లే అని తెలుస్తోంది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇప్పటికే తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల్లో బిజినెస్ పూర్తి అయింది.కానీ ఏపీ లోని ఏ ఒక్క ఏరియాల్లో కూడా ఇంకా బిజినెస్ ప్రారంభం కాలేదు.ఈనెల 15 లేదా 20 వరకు ఏపీలో టిక్కెట్ల రేట్లు విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఇండస్ట్రీ వర్గాల వారు కోరిన స్థాయిలో కాకున్నా ప్రభుత్వం కొంత మేరకు టికెట్ల రేట్లను పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆ నిర్ణయం ప్రకటించిన తర్వాతనే సినిమాల బిజినెస్ వ్యవహారాలు మొదలయ్యే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు