Akkineni Akhil, Puri Akash : ఎంతో ట్యాలెంట్ ఉన్న ఈ హీరోలు ఎందుకు హిట్ కొట్టలేకపోతున్నారు ?

సినిమా ఇండస్ట్రీ లో ట్యాలెంట్ ఒక్కటే ఉంటె సరిపోదు ఆవ గింజంత అదృష్టం కూడా ఉండాలి.

ఆమాత్రం అదృష్టం లేకపోవడం వల్లే చాల మంది స్టార్స్ తెరమరుగు అయిపోతున్నారు.

అందుకే సినిమా ఇండస్ట్రీ లో టాలెంట్ కన్నా ముందు సక్సెస్ ఉండాలి.అసలు ఎలాంటి టాలెంట్ లేకుండా కథ లో దమ్ము ఉండి, డైరెక్టర్ మంచి టెక్నీషియన్ అయినా కూడా ఆ హీరో ఖచ్చితంగా పెద్ద హీరో అయ్యే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు గంగోత్రి( Gangotri ) సినిమా టైం లో అల్లు అర్జున్( Allu Arjun ) ని చుసిన వారు చాల ట్రోల్ చేసారు కానీ దర్శకేంద్రుడి మాయాజాలం పని చేసి ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడం తో అల్లు అర్జున్ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.లేకుంటే తండ్రి లాగ సినిమా నిర్మాణం చేయాల్సి వచ్చేది.

మరి అలా కాకుండా నటన ఇరగదీయ గలిగే సత్త ఉండి ఒక్క హిట్ కూడా లేకపోవడం తో కొంత మంది హీరోల భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్ధకం గా ఉంది.ఆ హీరోల్లో చెప్పుకోవాల్సిన వ్యక్తి ముందుగా అక్కినేని అఖిల్( Akkineni Akhil ).అక్కినేని అనే బ్రాండ్ కి వారసుడు .తండ్రి, తాత, అమ్మ, అన్న అందరు నటీనటులే.అయినా కూడా సక్సెస్ అఖిల్ కి ఆమడ దూరం లో ఉంది.

Advertisement

పోనీ అఖిల్ చేతకాని వాడు అనుకోవడానికి లేదు.ఏజెంట్ సినిమా( Agent movie ) కోసం అఖిల్ దారుణమైన కసరత్తులు చేసి తన నటనను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు.

అయినా కూడా ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు హిట్ పడలేదు.పైగా అతడి కెరీర్ పై ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కి చాల బెంగగా ఉంది.

ఇక ఇలాగే బ్యాగ్రౌండ్ గట్టిగా ఉన్న మరొక హీరో పూరి ఆకాష్( Puri Akash ).తండ్రి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కానీ అతడు కూడా తీసిన అన్ని సినిమాలు ప్లాప్.బాగా నటించగలడు, ఫైట్స్, డ్యాన్స్ కూడా ఇరగదీస్తున్నాడు.

కానీ ఇతడికి కూడా ఎందుకో ఒక సరైన స్టోరీ పడటం లేదు.అన్ని కలిసి వస్తే ఖచ్చితంగా ఆకాష్ మంచి స్టార్ అవ్వగలడు.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలపై కోట్లకు కోట్లు కుమ్మరించారు.కానీ సరైన కథ, కథలో దమ్ము లేకపోవడం తో ప్లాప్ హీరోలు అనే ముద్ర వేయిచుకొని ఒక్క హిట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు