ఆ చిన్న హీరోల పక్కన నటించం అంటూ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్స్

కథను నమ్ముకుని సినిమాలో తీసే రోజులు పోయాయి.కేవలం సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ ఏంటి అనేది మాత్రమే ఇప్పుడు నటీనటులు చూసుకుంటున్నారు.

స్టార్ హీరో పక్కన ఎలాంటి హీరోయిన్ ఉన్నా కూడా సరిపోతుంది కానీ ఒక హీరోయిన్ సినిమా ఒప్పుకోవాలంటే తన పక్కన స్టార్ హీరోనే అయి ఉండాలి అనే రూల్స్ పెట్టుకున్నారు.చిన్న హీరోల సరసన నటించమంటే అస్సలు ఒప్పుకోవడం లేదు.

అది వారి మార్కెట్ స్ట్రాటజీ అవ్వచ్చు.అలాగే పెద్ద హీరో పక్కన నటిస్తే మరిన్ని సినిమాలు వస్తాయి అని అపోహ కూడా కావచ్చు.

కానీ కథ బాగా లేకుంటే ఎంత పెద్ద స్టార్ పక్కన నటించినా కూడా అది వృధా ప్రయాస అవుతుంది అది గతంలో అనేకసార్లు నిరూపితమైంది కూడా.

Advertisement

అలా చిన్న హీరోల సరసన నటించమంటే తమ వల్ల కాదు బాబోయ్ అంటూ రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అలీ( Ali ) అనే చిన్న కామెడీ హీరో పక్కన నటించడానికి తొలినాలలో సౌందర్య( Soundarya ) కూడా ఒప్పుకోలేదు.యమలీల సినిమాలో( Yamaleela ) మొదటి అనుకున్నా అది కుదరలేదు.

ఆ తర్వాత ఇంద్రజ అలీ సరసన నటించింది.వీరిద్దరి కాంబినేషన్లో మూడు నాలుగు సినిమాలు వచ్చాయి.

కానీ మళ్ళీ కొన్ని రోజుల గ్యాప్ తర్వాత అలీ పక్కన నటించమంటే అలాంటి ఒక చిన్న హీరో పక్కన నేను నటించడం ఏంటి అని ఇంద్రజ ఒప్పుకోలేదట.ఇక ఇలాంటి సమస్య రాజమౌళికి కూడా వచ్చింది.

మర్యాద రామన్న( Maryada Ramanna ) అనే ఒక చిన్న సినిమా తీయాలని రాజమౌళి నిర్ణయించుకున్న తర్వాత హీరోగా కమెడియన్ సునీల్ ని( Comedian Sunil ) తీసుకున్నాడు.అప్పటి వరకు ఎలాంటి సినిమాలో కూడా హీరోగా నటించనీ సునీల్ సరసన హీరోయిన్స్ గా అనుష్క,( Anushka ) త్రిషని( Trisha ) అడిగాడట రాజమౌళి.కానీ రాజమౌళి అయినా కూడా సునీల్ సరసన నటించేది లేదు అంటూ వీరిద్దరూ రిజెక్ట్ చేయడంతో మరొక చిన్న హీరోయిన్ అయినా సలోమీ తో నెట్టుకొచ్చాడు రాజమౌళి.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

అయితే ఇదంతా గతం ఇప్పుడు బ్యానర్, దర్శకుడు, బడ్జెట్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చిన్న సినిమా హీరోల పక్కన కూడా నటిస్తున్నారు అందుకే ఉదాహరణ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలు.అనుష్క అప్పుడు ఆ హీరోని రిజెక్ట్ చేసిన చిన్న హీరో అయిన నవీన్ తో సర్దుకుపోయింది.

Advertisement

తాజా వార్తలు