Tollywood Top Directors : టాలీవుడ్ డైరెక్టర్ల లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్కలు ఇవే.. వీరిలో ఎవరు టాప్ అంటే?

మామూలుగా సినిమా ఇండస్ట్రీ*( FIlm Industry )లో ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు డైరెక్టర్ల నుంచి హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు కూడా రెమ్యూనరేషన్ ను పెంచేస్తూ ఉంటారు.

అయితే కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు కూడా భారీగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.

అయితే మరి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు( Top Directors )గా రాణిస్తున్న డైరెక్టర్ ల రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Director Rajamouli ) గురించి మనందరికీ తెలిసిందే.గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపును ఏర్పరచుకున్నారు దర్శకుడు రాజమౌళి.ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతూ ఇప్పటికే 1100 కోట్ల వసూళ్లను సాధించింది.

ఇకపోతే రాజమౌళి ఒక్కో మూవీకి 60 నుంచి 65 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.

Advertisement

ఇక మరొక దర్శకుడు విషయానికి వస్తే.కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్( Director Prashanth Neel ). ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్.కాగా హీరో ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 40 నుంచి 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు సుకుమార్( Director Sukumar ).కాగా ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే సుకుమార్ సినిమా పుష్ప ది రూల్ కోసం 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ పూరి జగన్నాథ్( Director Puri Jagannath ) ఒక్కో సినిమాకి కోసం దాదాపుగా 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.అలాగే దర్శకుడు కొరటాల శివ( Director Koratala Siva ) కూడా ఒక్కొక్క సినిమాకు 25 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్( Director Shankar ) ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే శంకర్ పారితోషకం విషయానికి వస్తే ఒక్కో సినిమాకు గాను 40 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) పారితోషికం విషయానికి వస్తే ఆయన ఒక్కో సినిమాకు 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు