ఆర్ఆర్ఆర్ షూటింగ్ అలియా అందాలతో మొదలెడుతుంది అంట

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియ భట్ నటిస్తున్న మొట్టమొదటి సౌత్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్ రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో కనిపించబోతుంది.

రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం అలియా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడిపోయింది.

తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.కాని వీలైనంత త్వరగా షూటింగ్ తిరిగి ప్రారంభించాలని రాజమౌళి షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

లాక్ డౌన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి షూటింగ్ లకి పర్మిషన్ దొరికిన వెంటనే షెడ్యూల్ స్టార్ట్ చేసి మొదటిగా సాంగ్ తో షూట్ స్టార్ట్ చేయాలని జక్కన్న ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సాంగ్ అలియా భట్, రామ్ చరణ్ మీద చిత్రీకరిస్తారని సమాచారం.

Advertisement

ఆ తర్వాత ఆమె తో కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసే ప్లాన్ చేస్తున్నారట.ఇప్పటి వరకు 80% షూటింగ్ పూర్తి కావడంతో మళ్ళీ సాంగ్ తో షెడ్యూల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని జక్కన్న ఇళ్ళ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ లెక్కన సాంగ్ షూట్ అంటే ఆర్ఆర్ఆర్ ని అలియా తన అందాలతోనే మొదలెట్టబోతుంది అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు