రోజా వంట పై కామెంట్ చేసిన బండ్ల గణేష్... 

టాలీవుడ్

సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ తర్వాత కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని అలాగే సినీ నిర్మాతగా మారి ఎన్నోపలు భారీ బడ్జెట్ చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించిన 

బండ్ల గణేష్

గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.

అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి కూడా వచ్చారు.

ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి తన సేవలు కూడా అందించారు.అయితే తాజాగా

బండ్ల గణేష్ వైకాపా ఎమ్మెల్యే మరియు సీనియర్ హీరోయిన్ రోజా

పై చేసినటువంటి ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే

జబర్దస్త్ కామెడీ షో

జడ్జి మరియు

చిత్తూరు జిల్లా

లోని నగరి నియోజకవర్గ

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా

లాక్ డౌన్ కారణంగా కారణంగా ఇంటికే పరిమితమై తన కుటుంబ సభ్యుల కోసం చికెన్ వంటకాల్ని చేస్తూ ఓ వీడియోని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.అయితే ఈ వీడియోలో చికెన్ మరియు గుడ్లు బాగా తినాలని దీనివల్ల మనలో హ్యుమానిటీ శక్తి పెరిగి కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి చాలా తోడ్పడుతుందని తెలిపింది.

అయితే ఈ వీడియోపై బండ్ల గణేష్ స్పందిస్తూ ధన్యవాదాలు

ఆర్కె రోజా సెల్వమణి

గారు అంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.

Advertisement

అంతేకాక

చికెన్

తినడం వల్ల

కరోనా వైరస్

వస్తుందని కొంతమంది అపోహ పడుతున్నారని అందువల్ల తమలాంటి

పౌల్ట్రీ ఫార్మ్

యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రముఖులు ఇలాంటి వీడియోలు ద్వారా చికెన్ మరియు గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ రాదని అవగాహన కల్పిస్తే తమ లాంటివాళ్ళు నష్టాల బాట పట్టకుండా ఉంటామని తెలిపారు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు