ఆ పాత్రలో చేయడానికి భయపడ్డాను.. రాశిఖన్నా షాకింగ్ కామెంట్స్?

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన నటి రాశి ఖన్నా ప్రస్తుతం వరుస తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఈమె తెలుగు తమిళ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా తాను నటిస్తున్న హిందీ వెబ్ సిరీస్ రుద్ర గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తాను నటిగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నాను అలాంటిది ఈ హిందీ వెబ్ సిరీస్ లో నెగటివ్ పాత్రలో నటించాలంటే కాస్త భయపడ్డానని రాశిఖన్నా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రుద్ర అనే వెబ్ సిరీస్ లో తన పాత్ర పూర్తిగా నెగిటివ్ ఉండడంతో నా కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి నెగిటివ్ పాత్రలో నటించానని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.ఒక నటిగా పాజిటివ్ పాత్రలలో నన్ను ఎంతగా ఆదరించారో నెగిటివ్ పాత్రలలో కూడా నన్ను అదే స్థాయిలో ఆదరించారని ఇలా నటికీ ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు తాను ఎన్నో విభిన్న పాత్రలలో నటించడానికి ఆసక్తి కనబరుస్తారని ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక రాసి ఖన్నా వెబ్ సిరీస్ గురించి మాత్రమే కాకుండా ఈమె సినిమాల విషయానికి వస్తే మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సరసన నటించిన పక్కా కమర్షియల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్నారు.ఇకపోతే ఈనెల 22వ తేదీ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాశి ఖన్నా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన గురించి ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకుంటున్నారు.

Advertisement
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

తాజా వార్తలు