సంక్రాంతి 2023.. ఎన్ని సినిమాల మధ్య పోటీనో తెలుసా?

కరోనా తగ్గుముఖం పట్టి థియేటర్ లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడంతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పెద్ద పెద్ద సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి.

ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

మరికొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.ఇకపోతే ప్రస్తుతం తెలుగు సిని ఇండస్ట్రీలో టాప్ హీరో చిరంజీవి నుంచి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరకు హీరోలు వరుస సినిమా లలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే కొంతమంది హీరోలు వరుసగా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.ఇక ఇప్పటికే ఈ ఏడాది మోస్తారు సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఈ ఏడాది సంక్రాంతికి వరుసగా సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.కానీ 2023 సంక్రాంతి పండుగకు ఇంకా చాలా సమయం ఉండగానే అప్పుడే సినిమాలు బెర్త్ లు కన్ఫామ్ చేసుకుంటున్నాయి.

Advertisement

ఇప్పటికే కొన్ని సినిమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా మరికొన్ని సినిమాలు వచ్చే ఏడాది సంక్రాతి బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాయి.ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకొని అందుకు తగ్గట్టుగా ప్లాన్స్ వేసుకుంటున్నారు.

కాగా 2023 సంక్రాంతి కి ఇంకా చాలా సమయం ఉండగానే కొన్నీ సినిమాలు సంక్రాతికి విడుదల చేయడానికి బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి.టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా పండగని ఫిక్స్ చేసుకుంది.

సంక్రాంతికి కలుద్దాం అని దర్శక నిర్మాతలు ప్రకటించారు.ఈ సినిమాతో పాటుగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీర మల్లు సినిమా కూడా సంక్రాంతికే విడుదల కానుంది.

అలాగే మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడానికి రెడీగా ఉంది.అలాగే దళపతి విజయ్ వంశీ పైడిపల్లి, దిల్ రాజు వారసుడు కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటన చేసారు.అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కూడా సంక్రాంతి బరికిలోకే దిగుతుంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ సినిమా కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.అయితే సంక్రాంతి పండుగకు ఇంకా చాలా సమయం ఉండగానే ఇప్పటికి అరడజను సినిమాలు బెర్త్ ఖరారు చేసుకున్నాయి.

Advertisement

సినిమాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా వుంది.కొన్ని డ్రాప్ కూడా కావచ్చు.

సంక్రాంతి అంటే పెద్ద సినిమాల పండగ కూడా.ప్రతి ఏడాది కనీసం మూడు పెద్ద సినిమాలు వుంటాయి.రెండు రోజుల గ్యాప్ లో వస్తుంటాయి.

కరోనా కారణంగా గత రెండేళ్ళుగా కళ తప్పింది.ఈ ఏడాది మళ్ళీ పెద్ద వినోదాలు ప్రేక్షకులు ముందుకు రావడం బాక్సాఫీసు కి సంక్రాంతి కళ వచ్చినట్లే.

మరి సంక్రాంతి బరిలో రానున్న సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి మరి.అదేవిధంగా ఏఏ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయో చూడాలి.

తాజా వార్తలు