వీడియో: ప్లేస్కూల్‌లో దారుణం.. చిన్నారిని దారుణంగా కొట్టిన సీనియర్ స్టూడెంట్..

బెంగళూరులోని( Bengaluru ) ఓ ప్లేస్కూల్‌లో ( Playschool ) దారుణం చోటుచేసుకుంది.

టీచర్లు పిల్లలను లాక్ వేసి ఒక గదిలో ఉంచగా అందులో ఓ బాలికను ఒక బాలుడు శారీరకంగా హింసించాడు.

దీనికి సంబంధించి సీసీటీవీలో రికార్డైన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.తల్లిదండ్రులు ఈ వీడియో చూసి ఆందోళనకు గురవుతున్నారు.

వైరల్ వీడియోలో రెండున్నరేళ్ల బాలుడు ఎలాంటి కారణం లేకుండానే ఏడాదిన్నర బాలికపై దారుణంగా దాడి చేయడం కనిపించింది.పిల్లలను చూసుకోవాల్సిన టీచర్ కొద్దిసేపు గది నుంచి బయటకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.

బాలిక శరీరంపై గాయాలను గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా శారీరక దాడి జరిగినట్లు వైద్యులు తెలిపారు.

Toddler Beats Up Girl In Playschool In Bengaluru Details, Playschool Violence, A
Advertisement
Toddler Beats Up Girl In Playschool In Bengaluru Details, Playschool Violence, A

ఈ విషయమై తల్లిదండ్రులు ప్లేస్కూల్ అధికారులను నిలదీయగా, ఈ సంఘటన గురించి తమకు తెలియదని అన్నారు.సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం వారు బాలుడు దాడి చేస్తున్న దృశ్యం చూసి షాకయ్యారు.తరువాత పోలీసులు ప్లేస్కూల్‌ను సందర్శించారు, అయితే సంఘటన గురించి తల్లిదండ్రులు ఎలాంటి స్టేట్‌మెంట్ లేదా వివరాలు అందించనందున కేసు నమోదు చేయలేదు.

ఘటనకు పాల్పడిన బాలుడిని ఇకపై ప్లేస్కూల్‌కు రావద్దని స్కూల్ యాజమాన్యం కోరింది.బాలిక కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించే ఈ టీచర్ల మధ్య తమ పిల్లను వదిలేయడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఆమెను కూడా మాన్పించారు.

Toddler Beats Up Girl In Playschool In Bengaluru Details, Playschool Violence, A

సాధారణంగా చిన్నపిల్లల్లో ఇలాంటి క్రూరత్వ వైఖరి ఉండదు కానీ నేటి సమాజంలో పెద్దలు చేస్తున్న పనులను చూసి పిల్లలు కూడా చెడిపోతున్నారు.ఇలాంటి ఘటనలు ఎక్కడైనా, ఎప్పుడైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం, మంచి స్కూళ్లలో చేర్పించడం చాలా అవసరం.

న్యూస్ రౌండప్ టాప్ 20 
Advertisement

తాజా వార్తలు