ఉద్యోగులకు షాకిచ్చిన టిక్​ టాక్​.. ?

కరోనా వచ్చాక అత్యధికంగా మానసిక వేధన అనుభవిస్తున్న వారు ఎవరంటే నిరుద్యోగులని చెప్పవచ్చూ.ఆ తర్వాత చాలీ చాలనీ జీతాలతో జీవితాన్ని నెట్టుకొచ్చే వారు.

ఇప్పటికే కోవిడ్ వల్ల ఎందరో ఉద్యోగాలు ఊడిపోయి రోడ్దునపడ్ద వారు పడుతున్న బాధలు వర్ణాతీతం.ఇకపోతే తాజాగా టిక్‌టాక్ ఉద్యోగులకు కూడా కష్టాలు మొదలైయ్యాయి.

ముఖ్యంగా భారత్ టిక్ టాక్ పై శాశ్వత నిషేధం విధించడంతో భారత ఉద్యోగుల్లో అనిశ్చిత స్థితి నెలకొన్నది.దీనివల్ల భారత్ లో దాదాపు 2 వేల మందికిపైగా ఆ యాప్ మాతృ సంస్థ అయినా బైట్ డాన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్యోగాలకు కోతపడిందట.

కాగా కీలక అధికారులు, ఉద్యోగులు తప్ప మిగతా వారిని తీసేస్తున్నట్టు బుధవారం ఉదయం ఈ సంస్ద ప్రకటించిందట.ఈ మేరకు ఉద్యోగులకు సీఈవో వేనెస్సా పాపాస్, అంతర్జాతీయ వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్లేక్ షాండ్లీలు లేఖ రాశారట.

Advertisement

ఇక టిక్ టాక్ ను భారత్ శాశ్వతంగా నిషేదించడంతో ఈ సంస్దలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంత పెద్ద షాక్ తగిలింది.అంతే లేండి సమయం వస్తే మంచైన, చెడు అయినా దానంతట అవే జరిగిపోతాయి.

కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?
Advertisement

తాజా వార్తలు