East Godavari District : తూర్పు గోదావరి జిల్లా నందిగూడెంలో పెద్దపులి సంచారం

తూర్పు గోదావరి జిల్లా( East Godavari District ) గోపాలపురం మండలం నందిగూడెంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.పెద్దపులి పాదముద్రలను గుర్తించిన స్థానిక రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

గోపాలపురం మండలం కరకపాడు అటవీ ప్రాంతంలో పెద్దపులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు( Forest officials ) అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే నిన్న సాయంత్రం మాతంగి మెట్ట ప్రాంతంలో సంచరించిన పులి ఇవాళ నందిగూడెంలో సంచరిస్తుంది. పెద్దపులి( Tiger ) సంచారం నేపథ్యంలో స్థానిక ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మరోవైపు రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పెద్దపులి జాడ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు