Ram Pothineni Akkineni Akhil : టైర్ 2 హీరోలకు ప్రెజెంట్ బ్యాడ్ టైం నడుస్తుందా.. మరి కలిసి వచ్చేది ఎప్పుడు?

టైర్ 1 హీరోలు నెమ్మదిగా సినిమాలు చేస్తూ ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఉంటారు.

ఇక ఈ మధ్య కాలంలో ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా కష్టమే అయ్యింది.

అయితే టైర్ 2 హీరోలు అలా కాదు.వీరు ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలు కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

మరి ఈ సినిమాల వల్లనే ఏడాది మొత్తం ఇండస్ట్రీ కళకళ లాడుతుంది.కానీ కోవిద్ దీనిని పూర్తిగా మార్చేసింది.

కోవిద్ తర్వాత టైర్ 2 హీరోలకు అస్సలు కలిసి రావడం లేదు.విడుదల అయినా ఒకటి అర మినహా మొత్తం సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.

Advertisement

దీంతో బాక్సాఫీస్ కూడా వెలవెల బోతుంది.నాని, నాగ చైతన్య, గోపీచంద్, విజయ్ దేవరకొండ వంటి వారు ఈ మధ్య కాలంలో అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యారు.

విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో వచ్చి దారుణమైన ప్లాప్ అందుకున్నాడు.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలతో వచ్చి చతికిల పడ్డాడు.ఇక నాని కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోతున్నాడు.

శ్యామ్ సింగరాయ్ తో ఓకే అనిపించినా నాని ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాతో దారుణంగా విఫలం అయ్యాడు.ప్రెసెంట్ నాని నటిస్తున్న దసరా సినిమా అయినా ఈయనకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.ఇక నాగచైతన్య థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా వంటి ప్లాపులతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

అలాగే రామ్ పోతినేని ది వారియర్ సినిమాతో, గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో పర్వాలేదు అనిపించు కున్నారు.ఇలా వీరంతా నెక్స్ట్ సినిమాలతో అయినా హిట్ అందుకోవాలని ఆశ పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు