చక్కిలిగింతల చెట్టు ఎక్కడుందో తెలుసా? ముట్టుకుంటే నవ్వే నవ్వు!

ప్రపంచంలో చాలా అద్భుతాలు ఉంటాయి.కొన్ని మనం అస్సలు నమ్మం.

అలాంటి నమ్మలేని నిజాలు ఈ ప్రపంచంలో చాలా జరుగుతాయి.

మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయం కూడా మీరు అస్సలు నమ్మరు.

కానీ ఇది నిజం.మీరు నమ్మిన నమ్మకపోయినా ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ముమ్మాటికీ నిజం.

మనలో సాధారణంగా చాలా మందికి చక్కిలిగింతలు ఉంటాయి.చిన్నపిల్లల్లో ఎక్కువుగా ఉన్తయి.

Advertisement

పెద్ద అయినా తర్వాత కూడా కొంతమందికి చక్కిలిగింతలు పోవు.కానీ చెట్లకు కూడా చక్కిలిగింతలు ఉంటాయా ? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తుంది.అవును చెట్టుకు కూడా చెక్కిలిగింతలు ఉంటాయట.

మన భూ ప్రపంచంలో కొన్ని లక్షల రకాల చెట్లు ఉన్నాయి.కొన్ని చెట్లకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి.

అలానే మనం ఇప్పుడు చెప్పుకోబోయే చెట్టుకు చక్కిలిగింతలు ఉన్నాయట.మనం ముట్టుకుంటే ఆ చెట్టు స్పందిస్తుందట.

ఈ చెట్టుకు కూడా మనుషులలాగే చక్కిలిగింతలు ఉన్నాయట.అందుకే ఈ చెట్టును చక్కిలిగింతల చెట్టు (గుద్గుదలీవాలా) అని పిలుస్తారట.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

ఇంతకీ ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయనే కదా మీ సందేహం ఎక్కడో కాదు ఈ చెట్లు మన దేశంలోనే ఉన్నాయి.ఉత్తరప్రదేశ్‌లోని దుద్వా నేషనల్ పార్క్ లోని అడవుల్లో ఈ కితకితలు చెట్లు ఉన్నాయి.

Advertisement

ఈ పార్కు పులులకు ప్రసిద్ధి చెందింది.ఇక్కడి కటార్నియాఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో 5 చెట్లు ఉన్నాయి.

అందులో 2 చెట్లు చనిపోయాయి.ఇప్పుడు మూడు చెట్లు మాత్రమే ఉన్నాయి.

ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ చెట్టును మీరు జస్ట్ అలా పట్టుకుంటే చాలు దాని ఆకులు, కొమ్మలు వెంటనే స్పందించి అటూ ఇటూ ఊగుతాయట.అందుకే ఈ చెట్టును చక్కిలిగింతలు చెట్టు అని పిలుస్తారు.

ఇది చాలా సున్నితమైన చెట్టు.ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రండియా డ్యుమెటోరమ్.

ఈ చెట్టు కాండం నుండి సున్నితమైన సెన్సార్లు చెట్టు అంతటా ప్రవహిస్తాయి కాబట్టి ఈ చెట్టును మనం అలా టచ్ చేయగానే కొమ్మలూ, ఆకులూ వెంటనే ఊగుతాయి.

ర్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ DFO యశ్వంత్ చెప్పారు.ఈ చెట్టు గింజలు, కాండాలను ఎన్నిసార్లు వేసిన పెరగలేదట.

ఇప్పుడు గ్రాఫ్టింగ్ పద్దతిలో కొత్త మొక్కలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.

తాజా వార్తలు