హుజూరాబాద్ లో త్రిముఖ పోటీ...అసలు నష్టం ఎవరికి?

హుజూరాబాద్ లో త్రిముఖ పోటీ ఉండనుందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

అయితే టీఆర్ఎస్ ను ఓడించాలని బీజేపీ, బీజేపీని ఓడించాలని టీఆర్ఎస్ ఈవిధంగా ఇరు పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నడంలో నిమగ్నమైన తరుణంలో కాంగ్రెస్ కూడా సీన్ లోకి రావడం ఒక్కసారిగా ఇరు పార్టీల వ్యూహాలను సవరించుకునే అవసరం ఏర్పడింది.

అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్ళనుందనే ఇన్నేళ్ళు ప్రచారం సాగిన నేపథ్యంలో ఇప్పడు ఎవరి ప్రాబల్యం, ఎవరి ఓటు బ్యాంకును కాపాడుకోవడం మీదనే ప్రస్తుతం పోటీలో ఉన్న పార్టీలు దృష్టి పెట్టే అవకాశం ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీలా ప్రచారం చేయకపోయినా నామ మాత్రంగా పోటీ చేసినా మిగతా పార్టీలకు ఎంతో కొంత నష్టం జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

  అయితే రేవంత్ రెడ్డి హుజూరాబాద్ లో కాంగ్రెస్ పోటీపై అధికారికంగా స్పందించకున్నా ఆఖరి స్థాయి చర్చల తరువాత అధికారికంగా తెలిపే అవకాశం ఉంది.అయితే వెంకట్ కూడా బలమైన నేత కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి స్థాయికి సరి సమానంగా ఉన్న అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా టీఆర్ఎస్ స్థాయి కాంగ్రెస్ స్థాయి ఒకటే అనే భావన ప్రజల్లో కలిగేలా కాంగ్రెస్ వెంకట్ ను అభ్యర్థి చేసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పోటీపై క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, టీఆర్ఎస్ మాత్రం ఏ అవకాశాన్ని వదులుకోవడానికి  ఇష్టపడడం లేదు.టీఆర్ఎస్, బీజేపీతో పోలిస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు అంత ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నికకాదు అని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.మరి ఈ త్రిమఖ పోటీ కింగ్ మేకర్ ఎవరన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

తాజా వార్తలు