టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్..!!

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్( TSPSC Paper Leakage ) కేసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు తీసుకురావడం తెలిసిందే.

ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వం పై మండిపడ్డాయి.

ప్రస్తుతం ఈ పేపర్ లీకేజ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.నీకు లో ఉన్న లింకులు బయటపడుతూనే ఉన్నాయి.

సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ప్రశ్నాపత్రం లీకేజ్ కి పాల్పడ్డ రాజేశ్వర్ దంపతుల టాప్ ర్యాంకర్లను సిట్ అరెస్టు చేయటం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా మరో ముగ్గురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

నిందితుడు రవి కిషోర్ ( Ravi Kishore )వద్ద భరత్ నాయక్, రోహిత్ కుమార్, సాయి మధు ఏఈ పేపర్లు కొన్నట్లు గుర్తించారు.దీంతో వారిని అరెస్టు చేసి విచారించనున్నారు.దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 40 దాటినట్లు అయ్యింది.

ఎప్పటికప్పుడు అరెస్టయినా నిందితులు ఇచ్చిన సమాచారంతో కొత్త నిందితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.దీంతో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.అరెస్ట్ అయిన వారి వద్ద నుండి వస్తున్న సమాచారంతో మరికొందరినీ విచారిస్తూ.

పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు.తవ్వే కొద్ది అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి.

ఒకరి లవర్ కోసం.మరొకరు భార్య కోసం ఇంకొకరు స్నేహితుడి కోసం ఇలా పేపర్ కొనుగోలు చేసినట్లు వ్యవహారం పోలీస్ దర్యాప్తులో వెళ్లడవుతుంది.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు