విశాఖలో కొత్త వ్యాధి.. ఇప్పటికే ముగ్గురి బలి !

విశాఖలో అంతుచిక్కని వ్యాధి విశ్వరూపం దాల్చింది.కేవలం వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది.

మన్యంలోని జీకేవీధి మండలం ధారకొండ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.తోకరాయితో ఈ వ్యాధి శరీరం మొత్తంగా వ్యాపించి వాపులు రావడంతో రెండు, మూడు రోజుల వ్యవధిలోనే దీని బారిన పడిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇప్పటికే ఇలాంటి లక్షణాలతో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మరణించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.గ్రామానికి చెందిన సుశీల అనే మహిళ శరీరమంతా వాపులు రావడంతో ఆమెను ధారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అక్కడి వైద్యులు ఆమెను పరీక్షలు నిర్వహించగా పరిస్థితి విషమంగా ఉందని చింతపల్లి సీహెచ్ సీకి తీసుకెళ్లమని చెప్పారు.దీంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది.

Advertisement

ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులకు ఈ వ్యాధి లక్షణాలు వెలువడ్డాయి.ఆస్పత్రికి తరలించే క్రమంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కరువడంతో పాటు గ్రామానికి ఉన్న రోడ్డు దెబ్బతిన్నాయి.

వారిద్దరి పరిస్థితి విషమించడంతో వాళ్లు కూడా చనిపోయినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్యసిబ్బంది గ్రామానికి రావడం లేదని, ఈ అంతుచిక్కని వ్యాధితో ప్రాణాలు పోతున్నాయని వాపోయారు.

ప్రభుత్వం స్పందించి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు