డబ్బు కోసం కిడ్నాప్ .. చివరికి కటకటాల వెనక్కి, యూకేలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు 45 ఏళ్ల జైలు

సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ముగ్గురు భారత సంతతి వ్యక్తులు యూకేలో( UK ) కటకటాల పాలయ్యారు.

వీరు ముగ్గురికి కలిపి 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని వోల్వర్‌హాంప్టన్ సిటీ సెంటర్‌లో ఒక వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన ఇద్దరు భారతీయ సంతతికి చెందిన సోదరులు, వారి అనుచరుడైన మరో వ్యక్తికి మొత్తం 45 జైలు శిక్ష విధించింది.బల్జీత్ బఘ్రాల్ (33),( Baljit Baghral ) అతని సోదరుడు డేవిడ్ బఘ్రాల్ (28),( David Baghral ) మరో వ్యక్తి 22 ఏళ్ల షానుతో( Shanu ) కలిసి గతేడాది నవంబర్‌లో పని ముగించుకుని తన కారు వద్దకు వెళ్తున్న ఓ వ్యాపారవేత్తను బంధించారు.

అనంతరం అతనిని ఒక వ్యాన్‌లో పడేసి.కళ్లకు గంతలు కట్టి ఓ ప్రాంతానికి తీసుకెళ్లారు.

తర్వాత బాధితుడి తలపై తుపాకీ పెట్టి బెదిరించి.తీవ్రంగా హింసించారు.

Advertisement

గత నెలలో వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టులో( Wolverhampton Crown Court ) జరిగిన విచారణ అనంతరం వీరు ముగ్గురు దోషులుగా తేలారు.అనంతరం ఈ వారం బఘ్రాల్ సోదరులు ఒక్కొక్కరికి 16 సంవత్సరాల జైలు శిక్ష, వారి సహచరుడికి 13 సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.నిందితులు ముగ్గురు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో ఈ కుట్ర చేశారని.

కానీ ఇప్పుడు జైలులో శిక్ష అనుభవిస్తున్నారని పోలీసులు తెలిపారు.

బాధితుడిని కొన్ని గంటల పాటు బంధించగా 19,000 జీబీపీ నగదును అప్పగించిన తర్వాతే నిందితులు అతనిని విడుదల చేశారు.వ్యాన్ నుంచి బయటపడ్డ వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రంగంలోకి దిగిన వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు సీసీటీవీ , నెంబర్ ప్లేట్ , మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు.

అనంతరం డేవిడ్ బఘ్రాల్‌ను , ఆ మరుసటి రోజు బల్జిత్‌ను అరెస్ట్ చేశారు.ఇది జరిగిన కొన్ని రోజులకు అమెరికాకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.షానును హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు