జుట్టు వీక్ గా మారి విప‌రీతంగా ఊడిపోతుందా.. వ‌ర్రీ వ‌ద్దు వెంట‌నే ఇలా చేయండి!

పోష‌కాల కొర‌త‌, ఆహార‌పు అల‌వాట్లు, ధూమ‌పానం, రోజురోజుకు పెరుగుతున్న కాలుషం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించ‌డం, ఒత్తిడి త‌దితర కార‌ణాల వ‌ల్ల ఒక్కోసారి మ‌న జుట్టు( hair ) చాలా వీక్ అయిపోతుంటుంది.

దాంతో జుట్టు విప‌రీతంగా ఊడిపోవ‌డం, చిట్ల‌డం, విగ‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి.

వీటికి ఎలా చెక్ పెట్టాలో తెలియ‌క తెగ వ‌ర్రీ అయిపోతుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ మాస్క్ ను వేసుకోవడం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు పొందుతారు.

మరి ఆ ప్రయోజనాలు ఏంటి.? అసలు ఆ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ఈ హెయిర్ మాస్క్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడి పండు( Pumpkin ).జుట్టుకు మేలు చేసే జింక్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు ఇ, విట‌మిన్ ఎతో స‌హా ఎన్నో పోష‌కాలు గుమ్మ‌డిపండులో మెండుగా ఉంటాయి.అందువ‌ల్ల మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పీల్ తొలగించిన గుమ్మడి పండు ముక్కలు వేసుకుని వాటర్ సాయంతో ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ మాస్క్ ను వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఈ హెయిర్ మాస్క్ వీక్ గా ఉన్న మీ జుట్టును స్ట్రాంగ్ గా మారుస్తుంది.జుట్టు కు చక్కని పోషణ అందిస్తుంది.మూలాల నుంచి జుట్టును బలోపేతం చేస్తుంది.

అలాగే హెయిర్ ఫాల్ సమస్యకు దూరం చేస్తుంది.జుట్టు చిట్లడం విరగడం లాంటి సమస్యలకు అడ్డుక‌ట్టే వేస్తుంది.జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి తమ జుట్టు వీక్‌గా మారి విపరీతంగా ఊడిపోతుందని బాధపడుతున్నవారు వెంటనే ఈ హెయిర్ మాస్క్‌ ను ప్రయత్నించండి.

వెంకటేష్ సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టర్ ఏంటో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు