విజయశాంతి, సాయిపల్లవి మధ్య ఉన్న ఈ పోలికను మీరు గమనించారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి, రానా హీరోహీరోయిన్లుగా నటించిన విరాటపర్వం సినిమా థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.

క్రిటిక్స్ సైతం ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు.రానా, సాయిపల్లవి ఖాతాలో ఈ సినిమాతో మరో సక్సెస్ చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే సాయిపల్లవి క్రేజ్ వల్లే ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.సాయిపల్లవిని ఫ్యాన్స్ ప్రస్తుతం లేడీ పవర్ స్టార్ అని ప్రశంసిస్తున్నారు.

చాలామంది హీరోయిన్లకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నా సాయిపల్లవి స్థాయిలో మాత్రం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బుధవారం జరిగిన విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లేడీ పవర్ స్టార్ అని సంభోదిస్తూ సాయిపల్లవి స్పెషల్ ఏవీని ప్రదర్శించడం గమనార్హం.

Advertisement

చాలా సంవత్సరాల క్రితం విజయశాంతికి ఇలాంటి క్రేజ్ ఉండేది.సాయిపల్లవిని లేడీ అమితాబ్ అని లేడీ సూపర్ స్టార్ అని సంబోధించేవారు.

ఆ తర్వాత సినిమాల్లోకి ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినా ఈ స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకోలేదు.విరాటపర్వం సినిమాకు ఏకంగా 14 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రం సాయిపల్లవికి భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

స్టార్ హీరోలకు జోడీగా ఛాన్స్ లు రాకపోయినా ఈ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకోవడం సాయిపల్లవికి మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు.ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సాయిపల్లవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు రెమ్యునరేషన్ ను పెంచుతారో లేదో చూడాల్సి ఉంది.సాయిపల్లవికి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి స్టార్ హీరోలు సైతం షాకవుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు