పబ్లిక్‌లో రొమాన్స్.. పోలీసుల రియాక్షన్ ఇదే

ప్రస్తుత యువత మరీ అద్వానంగా రోడ్లపై రెచ్చిపోతున్నారు.

పబ్లిక్( Public ) లో ఉన్న సమయంలో పక్కన ప్రజలు ఉన్న మాకేంటి అన్నట్లుగా కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రముఖ నగరం కాన్పూర్‌లో ఓ యువ జంట అనుమతులు లేకుండా రోడ్లపై బైక్ మీద రొమాన్స్ చేసి, వైరల్ అవుతున్న వీడియో పట్ల పోలీసుల యాక్షన్ మొదలైంది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గంగా బ్యారేజీ ( Ganga Barrage in Uttar Pradesh )దగ్గర చోటుచేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాన్పూర్‌లో( Kanpur ) కదులుతున్న బైక్‌పై రొమాన్స్ చేస్తున్న జంట వీడియో వైరల్ అంటూ క్యాప్షన్ జత చేసారు.

ఇలాంటి స్టంట్స్ చేసినప్పుడు పోలీసుల అనుమతి అవసరం.లేదంటే అది చట్టప్రకారం నేరం అవుతుంది.కానీ యువత కొందరు సోషల్ మీడియాలో రీల్స్ చేసేందుకు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడంతో వారికి సమస్యలు ఎదురవుతున్నాయి.

Advertisement

ఇక ప్రస్తుతం వీడియో వైరల్ మారడంతో ఈ ఘటనపై కాన్పూర్ పోలీసులు స్పందించారు.ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇక ఈ వీడియోపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది ఆ జంటకు బుద్ధి, జ్ఞానం ఉందా అని ప్రశ్నిస్తుండగా.మరికొందరు మాత్రం గంగా బ్యారేజీ పై పోలీసులు సరిగా డ్యూటీ చేయడంలేదా అని విమర్శిస్తున్నారు.

మొత్తానికి, రోడ్లపై అనుమతులు లేకుండా ఇలాంటి స్టంట్స్ చేసేవారు చట్టపరంగా కఠినంగా శిక్షించబడతారని ఇది స్పష్టం చేస్తుంది.కాబట్టి ఇలాంటి చర్యలు చెప్పుటకుండా తగు జాగ్రత్తలు తీసుంటే బాగుంటుంది.

వైరల్ వీడియో : కొడుకు బౌలింగ్ లో బౌండరీ వెలుపల క్యాచ్ పట్టిన తండ్రి
Advertisement

తాజా వార్తలు