ఈ ఏడాది T20 ప్రపంచకప్ జట్లు లిస్ట్ ఇదే.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసుకోండి?

క్రికెట్ క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది.ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

కాగా ఈటోర్నీకి నెదర్లాండ్స్, జింబాబ్వేలు అర్హత సాధించాయి.దీంతో T20 ప్రపంచకప్‌లో పాల్గొనే 16 జట్లను ICC తాజాగా ఖరారు చేసింది.

భారత్‌తో సహా 8 జట్లు నేరుగా సూపర్-12లో ఆడనుండగా, 8 జట్లలో 4 జట్లు మొదటి రౌండ్ తర్వాత సూపర్-12కి చేరుకుంటాయి.జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ బి టోర్నీ తొలి సెమీఫైనల్‌లో జింబాబ్వే జట్టు పాపువా న్యూ గినియాపై గెలుపొందగా, రెండో సెమీఫైనల్‌లో నెదర్లాండ్స్ అమెరికాను ఓడించింది.

ప్రస్తుతం ఈ 2 జట్లు క్వాలిఫయర్-బి ఫైనల్‌లో తలపడనున్నాయి.దీంతో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు జింబాబ్వే, నెదర్లాండ్స్ అర్హత సాధించాయి.

Advertisement

ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా ధృవీకరించింది.శుక్రవారం T20 ప్రపంచ కప్ 2022 షెడ్యూల్‌ను ICC ప్రకటించింది.

ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాగా, ఫైనల్ నవంబర్ 13న మెల్‌బోర్న్‌లో జరగనుంది.

టోర్నీలో అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలోని 7 వేర్వేరు నగరాల్లో మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి.

ప్రపంచ కప్‌లో మొదటి సెమీఫైనల్ నవంబర్ 9న సిడ్నీలో జరనుండగా, రెండవది నవంబర్ 10న అడిలైడ్ ఓవల్‌లో జరుగుతుంది.అడిలైడ్‌, ఓవల్‌లో ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ జరగడం ఇదే తొలిసారి.నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ జరుగుతుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఈ మ్యాచ్ జరగనుంది.భారత్, పాకిస్థాన్‌లతో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్-12లో భారత్, పాకిస్థాన్‌లతో పాటు చోటు దక్కించుకున్నాయి.

Advertisement

మెయిన్ డ్రాకు ముందు నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ క్వాలిఫయర్స్ ఆడనున్నాయి.మిగిలిన 4 జట్లు కూడా క్వాలిఫయర్స్‌లోకి ప్రవేశిస్తాయి.

తాజా వార్తలు