అదృష్టం అంటే వీరిదే.. ఇలా బ‌య‌ట‌కు రాగానే కూలిన బిల్డింగ్

‌ సాధారణంగా ఏదేని ఘోర ప్రమాదం జరిగే ముందర అక్కడి నుంచి తప్పించుకుని బయటపడే వారిని మనం చాలా సార్లు చూడొచ్చు.

అలా బయటపడ్డ వారిని చూసి పెద్దలు వీరు నక్కను తొక్కి వచ్చారు అందుకే వీరు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడ్డారని అంటుంటారు.

అలాంటి సంఘటన ఒకటి జరిగింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇంతకీ సదరు సంఘటన ఏ ప్రాంతంలో జరిగిందంటే.కర్నాటక రాష్ట్రంలో ఉన్న టెక్‌సిటీ బెంగళూరులో మూడంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది.

అందరూ చూస్తుండగానే బిల్డింగ్ నేలమట్టమైంది.ఈ క్రమంలోనే బిల్డింగ్ కూలిపోతుండగా స్థానికులు రికార్డు చేశారు.

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.బెంగళూరు సిటీలోని విల్సన్‌ గార్డెన్‌ ఏరియాలో ఉండే బిల్డింగ్ కూలినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

అయితే, బిల్డింగ్ కొద్ది రోజుల కిందట వంగిపోయి ఉండటాన్ని గమనించిన అధికారులు ఆ బిల్డింగ్‌లోని జనాలను అక్కడి నుంచి బయటకు పంపించేశారు.దాంతో ఆ ప్రాంతంలో ఎటువంటి నష్టం జరగలేదు.

జనం అంతా సేఫ్‌గా బయటే ఉన్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, ఇతర శాఖల సిబ్బంది, అధికారులు పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మూడు రోజుల కిందట బిల్డింగ్ కుంగిపోతున్నట్లు గుర్తించామని, ఈ నేపథ్యంలోనే భవనంలో ఉంటున్న ప్రజలను వేరే ఏరియాకు షిఫ్ట్ చేశామని తెలిపారు.

ఇకపోతే బిల్డింగ్ కూలిన సందర్భంగా ఎవరికి నష్టం జరగలేదని, గాయాలేమి కాలేదని పేర్కొన్నారు.అధికారులు అప్రమత్తతో వ్యవహరించి జనాలను బిల్డింగ్ నుంచి వెకేట్ చేయించడం పట్ల స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

బిల్డింగ్ కూలిపోతున్న సందర్భంగా రికార్డు చేసిన వీడియోను ఏఎన్ఐ మీడియా సంస్థ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది చూసి నెటిజన్లు ‘బీ సేఫ్, భవనం శిథిలావస్థకు చేరుకుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు