నానిని నమ్మి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నారా.. ఆ సినిమాతో కష్టమే అంటూ?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది.

ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

రోజురోజుకు పెద్ద సినిమాల బడ్జెట్లు పెరుగుతుండగా అదే సమయంలో నిర్మాణ వ్యయాలు కూడా పెరుగుతుండటం గమనార్హం.దర్శకులు సైతం మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కథలను తెరకెక్కిస్తున్నారు.

నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమా సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

ఈ సినిమా కొరకు రంగస్థలం లాంటి సెట్ వేయగా ఈ సెట్ కోసం ఏకంగా 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చైందని సమాచారం అందుతోంది.నాని గత సినిమాలు వీ, గ్యాంగ్ లీడర్ లకు భారీ మొత్తంలో ఖర్చైనా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

Advertisement

నాని సినిమాపై 60 కోట్ల రూపాయల ఖర్చు అంటే ఒక విధంగా రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి.

నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైతే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.మరోవైపు నాని నటించిన అంటే సుందరానికి ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.సుకుమార్ శిష్యులలో చాలామంది ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెలను, కథను నమ్మి ఈ సినిమా నిర్మాతలు ఖర్చు విషయంలో వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు