ఒత్తిడిని దూరం చేసి బాడీని యాక్టివ్‌గా మార్చే బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఇదే!

నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి అనేది చాలా కామన్ గా వేధించే సమస్యగా మారింది.అయితే ఒత్తిడికి గురైనప్పుడు ఏ పని పైన దృష్టి సారించలేకపోతుంటారు.

లోలోన తీవ్రంగా మధన పడిపోతుంటారు.ఒక్కోసారి ఒత్తిడి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం చుట్టేస్తాయి.

అందుకే ఒత్తిడి బారిన ప‌డినప్పుడు దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే రిఫ్రెషింగ్ డ్రింక్ ను తీసుకుంటే ఒత్తిడి క్షణాల్లో చిత్తు అవ్వడమే కాదు బాడీ ఫుల్ యాక్టివ్ గా సైతం మారుతుంది.

మరి ఇంతకీ ఆ రిఫ్రెషింగ్ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

Advertisement
This Is The Best Refreshing Drink To Relieve Stress And Make The Body Active! Re

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ బీట్ రూట్ తురుము వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

This Is The Best Refreshing Drink To Relieve Stress And Make The Body Active Re

ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఆఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు వేయించిన జీలకర్ర పొడి వేసుకుని మరో ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.అనంతరం స్ట‌వ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ లో చిటికెడు పింక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి అరగంట లేదా గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.అనంతరం వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే ఒత్తిడిని తరిమికొట్టే బెస్ట్ రిఫ్రెషింగ్‌ డ్రింక్ సిద్ధం అవుతుంది.

ఈ డ్రింక్‌ను తీసుకుంటే క్షణాల్లో ఒత్తిడి పరారవుతుంది.తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.

అదే సమయంలో బాడీ యాక్టివ్ గా మరియు ఎనర్జిటిక్ గా మారుతుంది.

మా ఇంట్లో వారే అలాంటి  పక్షపాతం చూపేవారు... ఎమోషనల్ అయిన విష్ణు ప్రియ!
Advertisement

తాజా వార్తలు