వివరణ ఇవ్వడానికి ఇది వేదిక కాదు.. నెటిజన్ కు కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్ !

This Is Not The Platform To Give An Explanation Harish Shankar Countered The Netizen, Harish Shankar, Pawankalyan, Ustad Bhagath Singh, Twitter

ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎంతో పేరు పొందారు.ఇక తాజాగా ఈయన పవన్ కళ్యాణ్(Pawankalyan) హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagath Singh) అనే సినిమాను తెరెక్కిస్తున్నారు.

 This Is Not The Platform To Give An Explanation Harish Shankar Countered The Net-TeluguStop.com

ఇక ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అయినప్పటికీ ఇలా ఈ సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నెటిజన్స్ ఈ సినిమా గురించి ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి డైరెక్టర్ శంకర్ ను ప్రశ్నించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కోలీ వుడ్ సూపర్ హిట్ చిత్రం తేరి సినిమాకు రీమేక్ గా తెరెకెక్కిస్తున్నారనీ తెలుస్తుంది.సుమారు మూడు సంవత్సరాల సమయం తీసుకొని రీమేక్ తీయడం ఏంటీ అని ప్రశ్నించారు.షాక్. మిరపకాయ్, గబ్బర్ సింగ్,రామయ్యా వస్తావయ్యా వంటి సినిమాలను తీసిన మీరు మూడు సంవత్సరాల సమయం తీసుకొని ఈ సినిమా చేయడం ఏంటని? ఇప్పుడు తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రీమేక్ అంట కదా అని నెటిజన్ ట్వీట్ చేశారు.

ఈ విధంగా నెటిజన్ చేసిన ఈ ట్వీట్ కి హరీష్ శంకర్ స్పందిస్తూ…కేవలం భావాలను వ్యక్తం చేయడానికి ట్విట్టర్ అనేది ఒక వేదిక మాత్రమే కానీ, వివరణ ఇవ్వడానికి కాదు అంటూ డైరెక్టర్ కౌంటర్ ఇచ్చారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ ట్వీట్ పై నెటిజన్స్ స్పందిస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ కి మద్దతు తెలుపగా మరికొందరు మాత్రం అన్నా నిజంగానే ఇది రీమేక్ చిత్రమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం సినిమాలు,రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

Harish Shankar,Pawankalyan,Ustad Bhagath Singh,Twitter - Telugu Harish Shankar, Pawankalyan, Ustadbhagath #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube